Danger Plastic Water Bottle: బ్యాగ్‌కు పక్కనే వాటర్ బాటిల్ పెడుతున్నారా? అయితే జర జాగ్రత్త

Danger Plastic Water Bottle
x

Danger Plastic Water Bottle: బ్యాగ్‌కు పక్కనే వాటర్ బాటిల్ పెడుతున్నారా? అయితే జర జాగ్రత్త

Highlights

Danger Plastic Water Bottle: చాలామంది ఎండలో బయటకు వెళ్తున్నప్పుడు బ్యాక్ సైడ్ బ్యాగ్ వేసుకుని, ప్లాస్టిట్‌ బాటిల్‌ దాని పక్కకు పెడుతుంటారు. అయితే ఇలా పెట్టడం వల్ల మనిషి ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని, ఒక్కోసారి అది ప్రాణాలనే తీయొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Danger Plastic Water Bottle: చాలామంది ఎండలో బయటకు వెళ్తున్నప్పుడు బ్యాక్ సైడ్ బ్యాగ్ వేసుకుని, ప్లాస్టిట్‌ బాటిల్‌ దాని పక్కకు పెడుతుంటారు. అయితే ఇలా పెట్టడం వల్ల మనిషి ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని, ఒక్కోసారి అది ప్రాణాలనే తీయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ వివారలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ మధ్య కాలంలో బ్యాక్ బ్యాగ్ వేసుకుని, దానిపక్కన ప్లాస్టిక్ వాటర్ పెట్టడం సర్వసాధారణం అయిపోయింది. అయితే ఇలా ప్లాస్టిక్ బాటిల్‌ ఎండకు గురైనప్పుడు, అది విచిన్నం చెందుతుంది. దీనివల్ల ఆ నీళ్లను తాగిన వాళ్ల ఆరోగ్యం పాడైపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల ఒక విధ్యార్ధి ఇలానే బ్యాగ్ పక్కన వాటర్ బాటిల్ పెట్టుకుని బయటకు వెళ్లాడు. మంచి ఎండలో ఉన్నప్పుడు ఆ వాటర్ బాటిల్‌లోని నీళ్లు తాగి, అక్కడికక్కడే మృతి చెందాడు. కాబట్టి ఎండలోకి వెళ్లేటప్పుడు ప్లాస్టిక్ బాటిల్‌ను.. బ్యాగ్ పక్కన పెట్టుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అసలేం జరుగుతుంది?

బ్యాగ్ పక్కనే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ పెట్టడం వల్ల ఎండ తీవ్రత ఆ బాటిల్‌పై ఎక్కువగా పడుతుంది. దీంతో బాటిల్లోని నీళ్లలో ఎక్కువ శాతం ప్లాస్టిక్ పదార్ధాలు కలిసిపోతున్నాయి. ముఖ్యంగా, పిఇటి ప్లాస్టిక్ బాటిల్స్ సూర్యరశ్మికి గురైనప్పుడు అవి విచ్చిన్నం చెందుతున్నాయి. దీనివల్ల ప్లాస్టిక్ హానికరమైన రసాయనాలను విడుదల చేస్తుంది. వీటిరి వివోసీలు అని పిలుస్తారు. అయితే ఆ బాటిల్‌లో నీళ్లు ఉండడంతో చాలా సులువుగా ఆ రసాయన పదార్ధాలు నీళ్లలో కలిసిపోతున్నాయి. ఈ నీళ్లు తాగిన వ్యక్తులు అస్వస్తతకు గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ రసాయనాలు మనిషి ప్రాణాలనే తీస్తున్నాయి.

ఎలాంటి జబ్బులు రావొచ్చు?

ప్లాస్టిక్ బాటిళ్లు వేడికి గురైనప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్‌లోని రసాయనాలు నీటిలో కరిగిపోతాయి. దీనివల్ల కాలేయ క్యాన్సర్, డయాబెటీస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఈ నీళ్లు తాగిన వెంటనే కళ్లు తిరగడం, తల నొప్పి, తల తిరుగుతున్నట్టు ఉండటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అయితే అప్పుడే అప్రమత్తమై డాక్టర్లని కలవడం మంచిది.

ఏం చేయాలి?

ప్లాస్టిక్ బాటిల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండలోకి తీసుకెళ్లకూడదు. ఎండ నేరుగా తగలడం వల్లే ఈ సమస్యలు తలెత్తుతాయి. ఒకవేళ తీసుకెళ్లాలి అనుకుంటే బ్యాగ్ లోపల భాగంలో బాటిల్స్‌ని పెట్టాలి. దీని వల్ల కొంతైనా సమస్యలను నివారించవచ్చు. అదేవిధంగా ప్లాస్టిక్ బాటిల్స్‌ని పదే పదే ఉపయోగించడం, ప్లాస్టిక్ బాటిల్‌లో వేడి నీళ్లు పోయడం వంటివి చేసినా ఇటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories