Cancer Risk: డీఓడరెంట్ వాడితే క్యాన్సర్ వస్తుందా?.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!

Cancer Risk
x

Cancer Risk: డీఓడరెంట్ వాడితే క్యాన్సర్ వస్తుందా?.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!

Highlights

Cancer Risk: నేటి ఆధునిక జీవనశైలిలో మన చుట్టూ ఉన్న అనేక సౌందర్య ఉత్పత్తులలో డీఓడరెంట్ ఒకటి.

Cancer Risk: నేటి ఆధునిక జీవనశైలిలో మన చుట్టూ ఉన్న అనేక సౌందర్య ఉత్పత్తులలో డీఓడరెంట్ ఒకటి. శరీర దుర్వాసనను దూరం చేసి, మంచి సువాసనను అందించడానికి చాలా మంది దీనిని రోజూ ఉపయోగిస్తారు. అయితే, ఈ డీఓడరెంట్‌లలో వాడే రసాయనాల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందనే పుకారు చాలా కాలంగా ప్రచారంలో ఉంది. ఈ భయం ఎంతవరకు నిజం? ఆరోగ్య నిపుణులు దీని గురించి ఏం చెబుతున్నారో వివరంగా తెలుసుకుందాం.

పుకారు ఎందుకు పుట్టింది?

డీఓడరెంట్లు క్యాన్సర్‌కు కారణమవుతాయనే భయానికి ప్రధాన కారణం అందులో వాడే కొన్ని రసాయనాలే.ఇందులో ఉండే అల్యూమినియం కాంపౌండ్స్ తాత్కాలికంగా చెమట గ్రంథులను మూసివేసి, చెమట పట్టకుండా ఆపుతాయి. ఈ రసాయనాలను చంకల్లో తరచుగా వాడడం వల్ల రొమ్ము కణజాలంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కొందరు పరిశోధకులు వాదించారు. పారాబెన్స్ శరీరంలోని కొన్ని కణాలలో ఈస్ట్రోజెన్ హార్మోన్ మాదిరిగా పనిచేసి, హార్మోన్ల పనితీరుపై ప్రభావం చూపుతాయనే ఆందోళన ఉంది.

నిపుణులు ఏం చెబుతున్నారు?

ఆరోగ్య నిపుణుల ప్రకారం, డీఓడరెంట్ల వాడకం వల్ల క్యాన్సర్ వస్తుందనే వాదనకు సైద్ధాంతికంగా లేదా శాస్త్రీయంగా ఎటువంటి ఆధారం లేదు. అనేక పరిశోధనలు, అధ్యయనాలు జరిపినా... డీఓడరెంట్లను రెగ్యులర్‌గా వాడడం వల్ల రొమ్ము క్యాన్సర్ లేదా మరే ఇతర క్యాన్సర్ వస్తుందనడానికి ఇప్పటివరకు ఎలాంటి పక్కా ఆధారాలు లభించలేదు. ప్రజల్లో ఈ విషయంలో నెలకొన్న భయాలు కేవలం ఊహాజనితం మాత్రమే అని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రతిరోజూ డీఓడరెంట్ ఉపయోగించడం ప్రమాదకరం కాదు.

సురక్షితమైన వాడకం కోసం సలహాలు

ప్రస్తుత పరిశోధనల ప్రకారం రోజువారీ డీఓడరెంట్ వాడకం సురక్షితమే అయినప్పటికీ, అనవసరమైన ఆందోళనలు లేకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. డీఓడరెంట్ కొనే ముందు అందులో వాడిన పదార్థాలను తప్పక పరిశీలించండి. వీలైనంత వరకు అల్యూమినియం-ఫ్రీ, పారాబెన్-ఫ్రీ అని లేబుల్ ఉన్న డీఓడరెంట్లను లేదా సహజ సిద్ధంగా తయారుచేసిన ఉత్పత్తులను ఎంచుకోవడం మంచిది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి ముఖ్యంగా సమతుల్య ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండడం చాలా అవసరం.

Show Full Article
Print Article
Next Story
More Stories