Diabetes: యంగ్ ఏజ్‌లోనే డయాబెటిస్! జాగ్రత్తలు ఇలా..

Diabetes
x

Diabetes: యంగ్ ఏజ్‌లోనే డయాబెటిస్! జాగ్రత్తలు ఇలా..

Highlights

Diabetes: డయాబెటిస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఒకప్పుడు వయసు పైబడిన తర్వాతనే ఈ సమస్య వచ్చేది. కానీ, ఇప్పుడు యంగ్ ఏజ్‌లో ఉండగానే షుగర్ మొదలవుతుంది.

Diabetes: డయాబెటిస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఒకప్పుడు వయసు పైబడిన తర్వాతనే ఈ సమస్య వచ్చేది. కానీ, ఇప్పుడు యంగ్ ఏజ్‌లో ఉండగానే షుగర్ మొదలవుతుంది. ప్రస్తుతం ప్రతి నలుగురు డయాబెటిస్ పేషెంట్లలో ఒకరు నలభై ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారేనని ఓ స్టడీలో తేలింది. మరి దీనికై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

డయాబెటిస్, హైపర్‌టెన్షన్, గుండె జబ్బుల వంటివి ఇప్పుడు యంగ్ ఏజ్‌లోనే మొదలవుతున్నాయని, ఒబెసిటీ దీనికి ప్రధాన కారణంగా ఉంటోందని రీసెంట్‌గా జరిపిన కొన్ని స్టడీల ద్వారా తెలుస్తోంది. అలాగే ఈ రోజుల్లో చాలామందికి 18 ఏళ్లకే టైప్ 2 యాబెటిస్ మొదలవుతుందట. అయితే మారుతున్న ఫుడ్ హ్యాబిట్సే దీనికి కారణమని నిపుణులు చెప్తున్నారు.

జాగ్రత్తలు ఇలా..

ఈ రోజుల్లో కూర్చుని చేసే ఉద్యోగాలు ఉండడం వల్ల శారీరక శ్రమ తగ్గి ఒబెసిటీ పెరుగుతోంది. దీంతో చిన్న వయస్సులోనే డయాబెటిస్ వస్తుంది. కాబట్టి వ్యాయామం చేయడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి.

ప్రస్తుతం జంక్ ఫుడ్ కల్చర్ పెరిగింది. ఇది కూడా ఒబెసిటీ, డయాబెటిస్‌కు ఓ కారణం. కాబట్టి లీన్ ప్రోటీన్లు, డైటరీ ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ఉండేలా బ్యాలెన్స్‌డ్ డైట్ పాటించాలి.

నిద్రలేమి కారణంగా కూడా డాయాబెటిస్‌ ముప్పు పెరుగుతోంది. కాబట్టి ఏడు గంటలకు తగ్గకుండా నిద్రపోయేలా చూసుకోవాలి. ఒత్తిడి లేకుండా జాగ్రత్తపడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories