Diabetes: డయాబెటీస్‌తో బాధపడుతున్నవారు.. ఎండాకాలం ఈ 3 జ్యూసులు తీసుకోండి..

Diabetes
x

Diabetes: డయాబెటీస్‌తో బాధపడుతున్నవారు.. ఎండాకాలం ఈ 3 జ్యూసులు తీసుకోండి..

Highlights

Diabetes Friendly Juices: డయాబెటిస్ రోగులు అన్ని జ్యూసులు తీసుకోకూడదు. మీరు సరైన జీవన శైలి పాటించకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి.

Diabetes Friendly Juices: డయాబెటిస్ రోగులు సరైన జీవని శైలిని పాటిస్తేనే రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి. అంతేకాదు ప్రధానంగా ఎండాకాలం కొన్ని రకాల జ్యూసులు వాళ్ళ డైట్లో చేర్చుకోవాలి. దీంతో ఎండాకాలం హఠాత్తుగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి.

ఈ జ్యూసులు తీసుకోవడం వల్ల హైడ్రేషన్ అందుతుంది. అలాంటి మూడు రకాల డ్రింక్స్‌ ఎండాకాలం మీ డైట్‌లో ఉన్నాయా? వాటిని రెగ్యులర్ గా తీసుకుంటే వారికి ఆరోగ్యకరం.

కలబంద రసం..

కలబంద రసం తీసుకోవడం వల్ల డయాబెటిస్ వారికి మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుతాయి. ఇన్సులిన్ ఉత్పత్తికి ప్రేరేపించి కొలెస్ట్రాల్ కూడా తగ్గించేస్తాయి. కలబంద జ్యూసులు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. దీన్ని ఖాళీ కడుపున తీసుకోవాలి. ఇందులో కావాలంటే మీరు నిమ్మరసం నీళ్లు కలిపి తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందుతారు.

జామున్ జ్యూస్‌..

డయాబెటిస్ రోగులు ఎండాకాలం జామున్ జ్యూస్ తీసుకుంటే మంచిది. ఇది గ్లూకోజ్‌ మార్చే ప్రక్రియను నెమ్మదిస్తుంది. రక్తంలో హఠాత్తుగా చక్కెర పెరగనివ్వదు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ జామున్‌ జ్యూసు విత్తనాలు తీసేసి బ్లెండ్‌ చేసుకోవాలి. మంచి ఫలితాలు కలుగుతాయి, అయితే పరగడుపున తీసుకోవాలి.

కాకరకాయ జ్యూస్..

కాకరకాయ జ్యూస్ తీసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉంటుంది. ఇది జీవక్రియను కూడా నిర్వహిస్తుంది. తాజా కాకరకాయ తీసుకువచ్చి అందులో విత్తనాలు తీసేసి చిన్న ముక్కలు కట్ చేసి వాటిని బ్లెండ్‌ చేయాలి. ఇది ఉదయం పూట నిమ్మరసం, ఉప్పు వేసుకొని పరగడుపున తీసుకుంటే మంచి ఫలితాలు దొరుకుతాయి. అయితే, ఏ జ్యూస్ తీసుకున్న అతిగా తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories