Digestive Health : ఈ ఆహారాలు తిన్న వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు తాగవద్దు.. ఎందుకో తెలుసా?

Digestive Health : ఈ ఆహారాలు తిన్న వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు తాగవద్దు.. ఎందుకో తెలుసా?
x

Digestive Health : ఈ ఆహారాలు తిన్న వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు తాగవద్దు.. ఎందుకో తెలుసా?

Highlights

మంచి ఆరోగ్యం కావాలంటే నీరు ఎక్కువగా తాగాలి. అయితే, కొన్ని ఆహారాలు తిన్న వెంటనే నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

Digestive Health : మంచి ఆరోగ్యం కావాలంటే నీరు ఎక్కువగా తాగాలి. అయితే, కొన్ని ఆహారాలు తిన్న వెంటనే నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. నీరు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, కొన్నిసార్లు ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ విషయం కొందరికి తెలిసి ఉండవచ్చు. చాలా మంది దీనిని పాటిస్తూ ఉండవచ్చు. కానీ కొందరికి దీని గురించి తెలియదు. అందుకే అవసరమైనప్పుడల్లా నీరు తాగుతారు. కానీ ఇది జీర్ణ సమస్యలను కలిగించి, మలబద్ధకానికి కారణం కావచ్చు. మరి ఏ రకమైన ఆహారాలు తిన్న తర్వాత నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు, ఎందుకు తాగకూడదు, నీటికి ఆ ఆహారానికి సంబంధం ఏమిటి అనే విషయాలను ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

1. భోజనం తర్వాత నీరు తాగడం వల్ల కలిగే నష్టాలు

ఒక అధ్యయనం ప్రకారం భోజనం తర్వాత వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణ ఎంజైమ్‌లు బలహీనపడతాయి. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. జీర్ణక్రియ సరిగ్గా జరిగి ఆరోగ్యం చెడిపోకూడదంటే, సాంప్రదాయ ఆయుర్వేద పద్ధతి ప్రకారం, భోజనం చేసిన తర్వాత కనీసం 30 నిమిషాల పాటు ఎటువంటి పానీయాలు కూడా తాగకూడదు. అంతేకాదు, కొన్ని ఆహారాలు తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు తాగకూడదు.

2. బొప్పాయి తిన్న తర్వాత

బొప్పాయి పండులో 96% నీరు ఉంటుంది. దీనిని తిన్న వెంటనే నీరు తాగితే కడుపులో ద్రవాలు మరింత బలహీనపడతాయి. జీర్ణ రసాల సాంద్రత తగ్గిపోతుంది. ఆహారం జీర్ణం కావడం నెమ్మదిస్తుంది. కాబట్టి బొప్పాయి తిన్న తర్వాత కనీసం 40 నుండి 50 నిమిషాల వరకు నీరు తాగకూడదు. ఇతర పానీయాలను కూడా సేవించకూడదు.

3. అరటిపండు తిన్న తర్వాత

అరటిపండులో పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అరటిపండు తిన్న వెంటనే నీరు తాగితే అజీర్ణం, కడుపు ఉబ్బరం కలుగుతాయి. సాధారణంగా ఈ పండులో ఉండే పోషకాలను శరీరం గ్రహించుకోవడానికి కడుపులోని ఎంజైమ్‌లు అవసరం. చాలా తొందరగా నీరు తాగడం వల్ల ఈ ఎంజైమ్‌లు బలహీనపడవచ్చు. కాబట్టి, అరటిపండు తిన్న తర్వాత 30 నిమిషాలు వేచి ఉండి ఆ తర్వాత నీరు తాగవచ్చు.

4. సిట్రస్ పండ్లు తిన్న తర్వాత

నిమ్మ, నారింజ వంటి పుల్లని సిట్రస్ పండ్లు కడుపులో ఆమ్ల ఉత్పత్తిని పెంచుతాయి. కాబట్టి, వెంటనే నీరు తాగడం వల్ల ఈ ఆమ్లాలు బలహీనపడవచ్చు, pH బ్యాలెన్సుకు ఆటంకం కలిగి, గ్యాస్ లేదా అజీర్ణానికి కారణం కావచ్చు. కాబట్టి, సిట్రస్ పండ్లు తిన్న తర్వాత 30 నిమిషాలు వేచి ఉండి ఆ తర్వాత నీరు తాగవచ్చు.

5. వేరుశనగలు తిన్న తర్వాత

సాధారణంగా వేరుశనగలో కొవ్వు, ప్రొటీన్‌లు అధికంగా ఉంటాయి. వీటిని తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఇది అజీర్ణం లేదా కడుపు బరువుగా అనిపించడానికి కారణం కావచ్చు. ముఖ్యంగా ఈ సమస్య పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి, వేరుశనగ తిన్న తర్వాత 20 నుండి 30 నిమిషాల విరామం తీసుకోవాలి.

6. పాలు తాగిన తర్వాత

వెచ్చని పాలు తాగిన వెంటనే నీరు తాగడం వల్ల పాలలో ఉండే ప్రొటీన్‌లను పొందడానికి కడుపులోని ఆమ్లాలు బలహీనపడతాయి. ఇది జీవక్రియను నెమ్మదిస్తుంది. అంతేకాదు, కడుపులో యాసిడిటీ పెంచుతుంది. కాబట్టి, జీర్ణ సమస్యలు రాకుండా, ఆరోగ్యం బాగా ఉండటానికి పాలు తాగిన తర్వాత నీరు తాగాల్సి వస్తే 30 నిమిషాల నుండి ఒక గంట వరకు వేచి ఉండటం మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories