Sleepy After Eating: తిన్న వెంటనే నిద్రపోతున్నారా? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!

Sleepy After Eating
x

Sleepy After Eating: తిన్న వెంటనే నిద్రపోతున్నారా? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!

Highlights

Sleepy After Eating: చాలామందికి మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే, లేక రాత్రి తిన్న తరువాత బెడ్ ఎక్కేసే అలవాటు ఉంటుంది.

Sleepy After Eating: చాలామందికి మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే, లేక రాత్రి తిన్న తరువాత బెడ్ ఎక్కేసే అలవాటు ఉంటుంది. "తిన్న తర్వత విశ్రాంతి అవసరం" అనుకుంటూ ఇది సాధారణంగా చేసేస్తారు. కానీ డాక్టర్ల చెబుతుంటే – ఇది మన ఆరోగ్యానికి చాలా హానికరమైన అలవాటు. దీని వల్ల శరీరంలో అనేక రకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

ఫుడ్ తిన్న వెంటనే మగత ఎందుకు వస్తుంది?

భోజనం చేసిన తర్వాత వచ్చే అలసటను ఫుడ్ కోమా (Food Coma) అంటారు. ఇది శరీరం జీర్ణ ప్రక్రియలో ఎనర్జీ ఎక్కువగా వినియోగించడంవల్ల ఏర్పడుతుంది. కానీ తిన్న వెంటనే పడుకోవడం అలవాటైపోతే… ఆరోగ్య సమస్యలకు ఇది ఒక ఆరంభం అవుతుంది.

తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల కలిగే నష్టాలు:

జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది

తినగానే పడుకోవడం వల్ల ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవచ్చు. దీని వల్ల గ్యాస్, అజీర్ణం, తలనొప్పి వంటి సమస్యలు ఏర్పడతాయి.

ఒబెసిటీ, డయాబెటిస్ ప్రమాదం

ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవడం వల్ల శరీరం దాన్ని కొవ్వుగా నిల్వ చేస్తుంది. దీర్ఘకాలంలో ఇది ఊబకాయం, షుగర్ వంటి జీవనశైలి రుగ్మతలకు దారి తీస్తుంది.

రక్త ప్రసరణకు ఆటంకం

తిన్న వెంటనే పడుకోవడం వల్ల రక్తప్రసరణ సరిగ్గా జరగదు. ఇది కొంతమంది వద్ద గుండె మంట, హార్ట్‌బర్న్, రక్తపోటు సమస్యలకు దారి తీస్తుంది.

నిద్రలేమి సమస్య

మధ్యాహ్నం పడుకునే అలవాటుతో రాత్రి నిద్ర ఆలస్యంగా వస్తుంది. ఇది నిద్రలేమి సమస్యను తీవ్రతరం చేస్తుంది.

అలాంటి అలవాటు ఉంటే ఇలా చేయండి:

మధ్యాహ్న భోజనాన్ని తేలికగా ప్లాన్ చేయండి. ఆకుకూరలు, కూరగాయలు, సూపులు లాంటివి మగతను తగ్గిస్తాయి.

♦ నాన్ వెజ్, ఫ్రైడ్ ఫుడ్స్ తక్కువగా తీసుకోండి. ఇవి జీర్ణానికి ఎక్కువ టైమ్ తీసుకుంటాయి.

♦ పాలు, పెరుగు, పనీర్, చీజ్ వంటివి తిన్న వెంటనే నిద్రపోతే నిద్ర మరింత బలంగా వస్తుంది — ఇవి ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ కారణంగా నిద్రను ప్రేరేపిస్తాయి. కనుక ఇవి ఆ సమయాల్లో తక్కువగా తీసుకోవాలి.

♦ భోజనం తర్వాత కనీసం 2 గంటల గ్యాప్ ఇచ్చి పడుకోండి.

♦ రాత్రి సరైన నిద్ర (6-8 గంటలు) పడితే, పగటిపూట నిద్రపోవాలనిపించదు.

తిన్న వెంటనే పడుకునే అలవాటు సౌకర్యంగా అనిపించినా… దీర్ఘకాలంలో అది ఆరోగ్యానికి శాపంగా మారుతుంది. జీర్ణవ్యవస్థకు విశ్రాంతి, శరీరానికి శక్తి ఇవ్వాలంటే – భోజనానికి, నిద్రకి మధ్య తగిన విరామం తప్పనిసరి!

Show Full Article
Print Article
Next Story
More Stories