Eggs in the Fridge : గుడ్లను ఫ్రిజ్‌లో పెడితే పోషకాలు పోతాయా ? నిపుణులు ఏం చెబుతున్నారు?

Eggs in the Fridge
x

Eggs in the Fridge : గుడ్లను ఫ్రిజ్‌లో పెడితే పోషకాలు పోతాయా ? నిపుణులు ఏం చెబుతున్నారు?

Highlights

Eggs in the Fridge : ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో గుడ్లు ముఖ్యమైనవి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని, ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలుసు.

Eggs in the Fridge : ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో గుడ్లు ముఖ్యమైనవి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని, ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలుసు. అయితే, చాలా మంది మార్కెట్ నుండి తెచ్చిన గుడ్లను నేరుగా ఫ్రిజ్‌లో పెట్టి నిల్వ చేస్తారు. కానీ, ఆరోగ్య నిపుణుల ప్రకారం, గుడ్లను ఫ్రిజ్‌లో ఎక్కువ కాలం ఉంచి తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదట.

గుడ్లు అత్యవసరమైన రోజువారీ ఆహార పదార్థాలలో ఒకటి. వీటిని తింటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. కానీ చాలా మంది, గుడ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనే ఉద్దేశంతో వాటిని ఫ్రిజ్‌లో పెడతారు. అయితే, ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, అన్ని ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టి తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ముఖ్యంగా గుడ్ల విషయంలో అవి పాడయ్యే లోపే తింటే ఉత్తమమని చెబుతున్నారు.

గుడ్లను ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో ఉంచి తినడం వల్ల, ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు నిరూపించాయి. గుడ్లను ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు నిల్వ చేయడం వల్ల వాటిలోని పోషకాలు చాలా వరకు పోతాయని పరిశోధనలు చెబుతున్నాయి. దీనివల్ల గుడ్ల ద్వారా శరీరానికి లభించే ప్రయోజనాల కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని, ఇతర ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే, సాధ్యమైనంత వరకు గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టకుండా ఉండటం మంచిది. తప్పనిసరి అయితే, చాలా తక్కువ సమయం మాత్రమే ఫ్రిజ్‌లో ఉంచాలని సూచిస్తున్నారు.

సాధారణంగా పోషకాలు సమృద్ధిగా ఉండే గుడ్లలో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తే అది తీవ్రమైన అనారోగ్యాలకు కారణం కావచ్చు. సాల్మొనెల్లా బ్యాక్టీరియా వల్ల అతిసారం, వాంతులు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రిఫ్రిజిరేటర్‌లో గుడ్లను నిల్వ చేయడం వల్ల, ఈ బ్యాక్టీరియా ఇతర ఆహార పదార్థాలకు కూడా సులభంగా వ్యాపించే ప్రమాదం ఉంది. అత్యవసరం అనుకుంటే, గుడ్లను నిల్వ చేయడానికి కొన్ని నియమాలు పాటించాలి. గుడ్లను 3 నుండి 5 వారాలకు మించి ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఒకవేళ నిల్వ చేయాల్సి వస్తే, వాటిని ఫ్రిజ్ కింద భాగంలో ఉన్న ప్రత్యేక పెట్టెలో ఉంచాలి. ఫ్రిజ్‌లో ఉంచే ముందు, గుడ్లను నీటితో శుభ్రంగా కడగడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories