Skin Health: ఇవి తింటే చర్మం నిగనిగలాడడం ఖాయం..

Do you know how vitamin c helps for skin health
x

Skin Health: ఇవి తింటే చర్మం నిగనిగలాడడం ఖాయం.. 

Highlights

మెరిసే ఆరోగ్యకరమైన చర్మం కావాలని అందరూ కోరుకుంటారు. అయితే చాలా మంది ఇందుకోసం మార్కెట్లో లభించే క్రీములను ఉపయోగిస్తుంటారు.

మెరిసే ఆరోగ్యకరమైన చర్మం కావాలని అందరూ కోరుకుంటారు. అయితే చాలా మంది ఇందుకోసం మార్కెట్లో లభించే క్రీములను ఉపయోగిస్తుంటారు. వీటివల్ల కొన్ని రకాల సైడ్‌ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అయితే సహజ పద్ధతుల్లో మెరిసే చర్మం సొంతమవ్వాలంటే తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకున్నా మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. ఇంతకీ ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

విటమిన్ C చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అత్యంత శక్తివంతమైన పోషకాల్లో ఒకటి. ఇది సహజ యాంటీఆక్సిడెంట్‌గా పని చేసి ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. చర్మానికి కాంతిని అందిస్తుంది, ముడతలను నివారిస్తుంది. మీ చర్మాన్ని ప్రకాశవంతంగా, మృదువుగా ఉంచేందుకు విటమిన్ C ఎంతగా సహాయపడుతుంది. విటమిన్ C ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించడంతో పాటు, చర్మాన్ని రక్షించే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. సూర్యరశ్మి, కాలుష్యం వల్ల చర్మం క్షీణించకుండా, ఈ విటమిన్ సహాయపడుతుంది.

కొల్లాజెన్ అనేది చర్మానికి స్థితిస్థాపకత (Elasticity) అందించే ప్రధాన ప్రోటీన్. దీంతో చర్మం ముడతలు పడవు. విటమిన్ C వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి, చర్మం మృదువుగా, యవ్వనంగా మారుతుంది. చర్మం అసమతుల్యంగా, ముదురుగా ఉండకుండా, విటమిన్ C సహాయపడుతుంది. నల్లటి మచ్చలు, సన్ టాన్, చర్మం అసమానంగా ఉండే సమస్యలను విటమిన్ C తగ్గిస్తుంది. ఇది చర్మంలో మెలానిన్ ఉత్పత్తిని నియంత్రించి, ప్రకాశవంతమైన లుక్ అందిస్తుంది. వయస్సు పెరుగుతున్నప్పుడు ముడతలు, చర్మం వదులుగా మారడం కామన్‌ అయితే విటమిన్ C చర్మాన్ని టైట్‌గా ఉంచి, ముడతలను తగ్గిస్తుంది.

నారింజ, నిమ్మకాయ, అనాస పండు, కివి, స్ట్రాబెర్రీ, ద్రాక్ష, జామ, బొప్పాయి, బ్లూబెర్రీ వంటి పండ్లలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. అదే విధంగా టమాటో, బ్రోకలీ, క్యారెట్, 🌶 క్యాప్సికమ్, పాలకూర, కాలీఫ్లవర్, క్యాబేజీ, బఠానీ (పీస్) వంటి కూరగాయల్లో కూడా విటమిన్ సి లభిస్తుంది. ఉదయం లెమన్ వాటర్ తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. రోజుకు కనీసం 2-3 విటమిన్ C పండ్లు లేదా కూరగాయలు తీసుకోవాలి

Show Full Article
Print Article
Next Story
More Stories