Mobile Camera Lenses: మొబైల్ కెమెరా లెన్స్ గురించి తెలుసా?

Mobile Camera Lenses: మొబైల్ కెమెరా లెన్స్ గురించి తెలుసా?
x

 Mobile Camera Lenses: మొబైల్ కెమెరా లెన్స్ గురించి తెలుసా?

Highlights

మొబైల్స్ లో ఫొటోలు తీయడాన్ని చాలామంది ఇష్టపడుతుంటారు. తీసే ప్రతి ఫొటో అందంగా, క్వాలిటీతో ఉండాలనుకుంటారు. అందుకోసం మంచి కెమెరా మొబైల్స్ ఉన్నాయి.

మొబైల్స్ లో ఫొటోలు తీయడాన్ని చాలామంది ఇష్టపడుతుంటారు. తీసే ప్రతి ఫొటో అందంగా, క్వాలిటీతో ఉండాలనుకుంటారు. అందుకోసం మంచి కెమెరా మొబైల్స్ ఉన్నాయి. ఇంకా ఫ్రొఫెషనల్‌గా కావాలనుకుంటే మొబైల్‌కు పెట్టుకోదగ్గ లెన్స్‌లు కూడా ఉన్నాయి.

మంచి ఫొటోల కోసం డీఎస్ ఎల్ ఆర్ కెమెరాలు కొనే రోజులు ఇప్పుడు పోయాయి. మొబైల్ తోనే మంచి క్వాలిటీ ఫోటోలు వస్తున్నాయి. మొబైల్ ఫొటోగ్రఫీని ఇంకా సీరియస్ గా తీసుకునే వాళ్లకోసం లెన్స్ లు కూడా ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో కొన్ని బేసిక్‌ మోడల్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

టెలీఫొటో లెన్స్

స్మార్ట్‌ఫోన్‌లలో ‘డిజిటల్‌ జూమ్‌’ ఆప్షన్‌ మాత్రమే ఉంటుంది. డిజిటల్ జూమ్‌లో తీసిన చిత్రాలు అంత స్పష్టంగా ఉండవు. కానీ ‘టెలీఫొటో లెన్స్‌’ ఇమేజ్‌ను చాలా దూరం వరకు ఆప్టికల్ జూమ్‌ చేయగలదు. పైగా ఇమేజ్‌ను క్వాలిటీగా తీయగలదు.

వైడ్ లెన్స్

ఐఫోన్ లో కెమెరా సాధారణంగా 70 డిగ్రీల ఏరియా కవర్ చేస్తుంది. వైడ్ లెన్స్ వాడితే 90 లేదా 100 డిగ్రీల వరకు చిత్రాన్ని బంధించొచ్చు. గ్రూప్ ఫొటోలు, ల్యాండ్‌స్కేప్ ఫొటోలకు ఈ లెన్స్‌ ఉపయోగించొచ్చు.

ఫిష్‌ ఐ లెన్స్

ఫిష్‌ ఐ లెన్స్‌ని ఉపయోగించి దాదాపు 180 డిగ్రీల కోణంలో కూడా ఫొటోలు తీయొచ్చు. ఈ లెన్స్ ఆకారం కొంచెం భిన్నంగా ఉండటంతో ఎక్కువ ప్రాంతాన్ని కవర్‌ చేయగలుగుతుంది. విశాలమైన ప్రదేశాలను ఫొటో తీయడానికి ఇవి ఉపయోగపడతాయి.

మాక్రో లెన్స్‌

ఇవి భూతద్దం లాంటి లెన్స్‌. ఈ లెన్స్‌తో చిన్న చిన్న కీటకాలు , పువ్వులను కూడా అందంగా క్యాప్చర్‌‌ చేయొచ్చు. ఫుడ్ ఫొటోగ్రఫీలో ఈ లెన్స్‌ ఎక్కువగా ఉపయోగిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories