Yoga: యోగా చేయాలని ఉన్నా చేయలేకపోతున్నారా? మీకు ఈ విషయం తెలిస్తే ఈ రోజే యోగా మొదలుపెడతారు


Yoga: యోగా చేయాలని ఉన్నా చేయలేకపోతున్నారా? మీకు ఈ విషయం తెలిస్తే ఈ రోజే యోగా మొదలుపెడతారు
Yoga: సాధారణంగా యోగా చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మైండ్ రిలాక్స్ అవుతుంది. అంతేకాదు శరీరం ప్లెక్సిబిలిటీ కావాలన్నా కూడా యోగా చేయాలి. అప్పుడే చాలా ప్రాణాంతకమైన వ్యాధుల నుండి శరీరాన్ని కాపాడుకోవచ్చు.
Yoga: సాధారణంగా యోగా చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మైండ్ రిలాక్స్ అవుతుంది. అంతేకాదు శరీరం ప్లెక్సిబిలిటీ కావాలన్నా కూడా యోగా చేయాలి. అప్పుడే చాలా ప్రాణాంతకమైన వ్యాధుల నుండి శరీరాన్ని కాపాడుకోవచ్చు. చికిత్సకు లొంగని వ్యాధులను కూడా ఈ ఒక్క యోగాతో నయం చేసుకోవచ్చు.
డిప్రెషన్
ఈ మధ్య కాలంలో ముగ్గురిలో ఒక్కరు డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. దీనికి కారణం కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు..ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉంటాయి. కానీ వీటి నుంచి బయటపడాలంటే యోగా చేయాలి. ప్రతిరోజూ యోగా చేయడం వల్ల స్ట్రెస్ రెస్పాన్స్ సిస్టమ్ పనితీరు క్రమంగా తగ్గుతుంది. దీనివల్ల బీపీ, గుండె స్థిరంగా కొట్టుకోవడం, శ్వాస మెరుగుపడటం జరుగుతుంది.
ఎముకలు బలంగా..
వయసు పెరిగే కొద్దీ చాలామందికి ఎముకలు, కండరాలు బలహీనంగా మారతాయి. దీనివల్ల జాయింట్ పెయిన్స్ అలాగే కండరాలు పట్టడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అదే యోగాసనాలు ప్రతిరోజూ చేస్తే శరీరం సాగుతుంది. మళ్లీ దగ్గరవుతుంది. ఇలా శరీరం సాగడం, తగ్గడం వల్ల కార్టిలేజ్‌కు కొత్త పోషకాలు అందుతాయి. దీనివల్ల కదలికలు జరిగి కీళ్లు, కండరాలు నొప్పిలేకుండా ఉంటాయి.
బలమైన వెన్నుముక కావాలంటే..
యోగాసనాలు చేసేటప్పుడు శరీరం ముందుకు వెనక్కి ఒంగుతుంది. దీంతో వెన్నుపూసల మధ్య ఉండే స్పైనల్ డిస్క్‌లు దగ్గరవుతూ దూరమవుతూ ఉంటాయి. ఈ కదలికల వల్ల వెన్నుపూసల మధ్య ఫ్లెక్సిబిలిటీ మెరుగుపడుతుంది. దీనివల్ల శరీరం మొత్తం పటుత్వాన్ని సాధించుకుంటుంది.
ఏకాగ్రత
కొంతమందికి ఏ పనిచేయాలన్నా ఏకాగ్రత ఉండదు. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని సమయంలో విలువైన వ్యక్తులను , పనులను కూడా ఏకాగ్రత లోపం వల్లే వదులుకుంటారు. అయితే ప్రతిరోజూ ఉదయమే యోగా చేయడం వల్ల మనసు ఉల్లాసంగా మారుతుంది. మనసులో ఉండే గజిబిజి ఆలోచనలను బయటకు పంపి ఆనందాన్ని నింపుతుంది. ఏకాగ్రతను పెంచడానికి మరికొన్ని ఆసనాలు ఉన్నాయి. ఈ ఆసనాలు వేయడం వల్ల కూడా మనిషి, మనసు చాలా రిలాక్స్ అవుతాయి.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire