Back Pain: నడుం నొప్పికి నడకే మంత్రం!

Back Pain
x

Back Pain: నడుం నొప్పికి నడకే మంత్రం!

Highlights

Back Pain: ఈ కాలంలో నడుము నొప్పి ప్రతి వయసువారినీ వెంటాడుతున్న సాధారణ సమస్యగా మారిపోయింది. ఉద్యోగస్తులైనా, గృహిణులైనా, యువతైనా – ఎవరైనా దీనికి లోనవుతున్నారు. "ఓహ్ నొప్పి!" అంటూ జీవితాంతం బాధపడాల్సిందేనని చాలామంది భావిస్తున్నారు

Back Pain: ఈ కాలంలో నడుము నొప్పి ప్రతి వయసువారినీ వెంటాడుతున్న సాధారణ సమస్యగా మారిపోయింది. ఉద్యోగస్తులైనా, గృహిణులైనా, యువతైనా – ఎవరైనా దీనికి లోనవుతున్నారు. "ఓహ్ నొప్పి!" అంటూ జీవితాంతం బాధపడాల్సిందేనని చాలామంది భావిస్తున్నారు. కానీ తాజాగా ఓ పరిశోధన ఆ అభిప్రాయాన్ని మార్చేలా ఉంది.

వాకింగ్‌తో వెన్నునొప్పికి వీడ్కోలు?

ఆస్ట్రేలియాలోని మెక్వారీ యూనివర్సిటీ పరిశోధకులు ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయం వెల్లడైంది. ప్రతి రోజు కొంతసేపు నడవడం ద్వారా వెన్నునొప్పి తగ్గుతుందని వారు తెలిపారు. అదే కాదు, ఒక నిర్దిష్ట పద్ధతిలో వారానికి 5 రోజులు నడక చేయడం ద్వారా నడుం నొప్పి మళ్లీ తిరిగి వచ్చే అవకాశాన్ని చాలా మేర తగ్గించవచ్చని వెల్లడించారు.

అధ్యయనం వివరాలు

ఈ అధ్యయనంలో 700 మందికి పైగా పాల్గొన్నారు. వారంతా ఆరు నెలల పాటు ప్రతిరోజూ నడకను అలవాటుగా మార్చారు. ఫలితంగా:

చాలామందికి మూడేళ్ల నుంచి వెంటాడుతున్న నడుం నొప్పి తగ్గింది

నడక వల్ల వెన్నునొప్పి మళ్లీ వచ్చే అవకాశం 28 శాతం తగ్గింది

బాధితులు ఇక డాక్టర్లను సంప్రదించాల్సిన అవసరం లేకుండా పోయింది

అయితే, నడక ఎందుకు ఈ మేరకు ప్రభావవంతంగా పనిచేస్తుందన్న దానిపై పరిశోధకులు ఇంకా స్పష్టతకు రాలేదు.

డబ్ల్యూహెచ్‌వో గణాంకాల ప్రకారం...

ప్రపంచ వ్యాప్తంగా సుమారు 620 మిలియన్ల మందికి వెన్నునొప్పి సమస్య ఉంది. ఈ నేపథ్యంలో సాధారణమైన నడక ద్వారా నొప్పి తగ్గించడం నిజంగా ఆశాజనకమైన పరిష్కారం.

ఆరోగ్యానికి నడకే మార్గం

శరీరానికి వ్యాయామం

గుండెకు ఆరోగ్యం

మానసిక ప్రశాంతత

మంచి నిద్ర

అందుకే, "మన ఆరోగ్యం మన నడకలోనే ఉంది" అన్న మాటకి మరొకసారి మద్దతుగా నిలిచింది ఈ అధ్యయనం!

Show Full Article
Print Article
Next Story
More Stories