Thyroid Pain : ఈ భాగాల్లో నొప్పి వస్తే నిర్లక్ష్యం చేయొద్దు.. ఇది థైరాయిడ్ లక్షణం కావచ్చు

Thyroid Pain : ఈ భాగాల్లో నొప్పి వస్తే నిర్లక్ష్యం చేయొద్దు.. ఇది థైరాయిడ్ లక్షణం కావచ్చు
x

Thyroid Pain : ఈ భాగాల్లో నొప్పి వస్తే నిర్లక్ష్యం చేయొద్దు.. ఇది థైరాయిడ్ లక్షణం కావచ్చు

Highlights

ఈ రోజుల్లో చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. మన మెడ భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి, మన శరీర ఉష్ణోగ్రత, గుండె కొట్టుకునే వేగం, మెదడు అభివృద్ధిని నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.

Thyroid Pain : ఈ రోజుల్లో చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. మన మెడ భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి, మన శరీర ఉష్ణోగ్రత, గుండె కొట్టుకునే వేగం, మెదడు అభివృద్ధిని నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ గ్రంథిలో ఏదైనా అసమతుల్యత ఏర్పడితే, అది అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. థైరాయిడ్ హార్మోన్ల సమతుల్యత దెబ్బతిన్నప్పుడు, అవి ఎముకలను బలహీనపరుస్తాయి. దీని ఫలితంగా శరీరంలోని వివిధ భాగాల్లో నొప్పులు మొదలవుతాయి. అందుకే, థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు ఎలాంటి నొప్పులు వస్తాయి, ఏ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

మెడ నొప్పి

మెడ నొప్పి థైరాయిడ్ సమస్యకు అత్యంత ముఖ్యమైన, మొదటి లక్షణం. కొందరిలో మెడ భాగంలో నొప్పి మాత్రమే కాకుండా, థైరాయిడ్ గ్రంథి ఉబ్బడం కూడా కనిపించవచ్చు. మీకు ఈ విధంగా తరచుగా నొప్పి లేదా వాపు కనిపిస్తే, దానిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది.

దవడ నొప్పి

థైరాయిడ్ హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడినప్పుడు దవడ నొప్పి కూడా రావచ్చు. దవడ నొప్పి దీర్ఘకాలంగా కొనసాగుతుంటే, దానికి థైరాయిడ్ సమస్య కారణం కావచ్చు. కాబట్టి, ఇతర కారణాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత కూడా నొప్పి ఉంటే, థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం అవసరం.

చెవి నొప్పి

థైరాయిడ్ హార్మోన్లలో తేడాలు వచ్చినప్పుడు చెవి నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది. సాధారణ చెవి నొప్పిలా కాకుండా, థైరాయిడ్ సమస్య వల్ల వచ్చే చెవి నొప్పిని తేలికగా తీసుకోకూడదు. ఇది థైరాయిడ్ వ్యాధికి ఒక అంతర్గత సంకేతం కావచ్చు. వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

కండరాల నొప్పి

సాధారణంగా థైరాయిడ్ గ్రంథి పరిమాణం పెరుగుతున్న కొద్దీ కండరాల నొప్పి కూడా పెరుగుతుంది. థైరాయిడ్ హార్మోన్ల లోపం కండరాల బలహీనతకు, నొప్పులకు దారితీస్తుంది. మీకు తరచుగా ఈ కండరాల నొప్పులు వస్తుంటే, ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని కలిసి తగిన పరీక్షలు చేయించుకోవాలి.

కీళ్ల నొప్పి

థైరాయిడ్ గ్రంథి పెరిగినప్పుడు కీళ్లలో నొప్పి రావడం కూడా ఒక లక్షణం. ముఖ్యంగా మోకాళ్లలో నొప్పి ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం, సరైన చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.

Show Full Article
Print Article
Next Story
More Stories