
Coconut Water Benefits: రోజూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
హైడ్రేషన్ నుంచి బరువు నియంత్రణ వరకు అనేక లాభాలు.. కానీ రోజూ తాగేవారు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
ప్రకృతి మనకు ప్రసాదించిన అమృతధార 'కొబ్బరి నీళ్లు'. ఇది కేవలం దాహాన్ని తీర్చే పానీయం మాత్రమే కాదు, పోషకాల గని అని నిపుణులు చెబుతున్నారు. మారుతున్న జీవనశైలిలో కృత్రిమ శీతల పానీయాల కంటే, సహజసిద్ధమైన కొబ్బరి నీళ్లను ఆశ్రయించడం ఆరోగ్యానికి ఎంతో మేలని పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తాగడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఉదయం పూట కొబ్బరి నీళ్లు తాగితే కలిగే లాభాలను పలువురు వైద్య నిపుణులు వివరించారు. ఉదయం ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగడం శరీరానికి రీఛార్జ్ అవుతుందన్నారు. అలాగే రోజంతా ఉత్సాహంగా ఉండటానికి అవసరమైన శక్తిని అందిస్తుందన్నారు. అలాగే అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడేవారికి కొబ్బరి నీళ్లు ఒక వరంగా చెబుతున్నారు. ఇది కడుపును చల్లబరిచి, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుందని చెప్పారు. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుందని వెల్లడించారు. శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపడం వల్ల చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుతుందన్నారు. మూత్ర విసర్జన సమయంలో వచ్చే మంటను తగ్గించి, కిడ్నీల పనితీరుకు సహాయపడుతుందన్నారు.
కొబ్బరి నీళ్లను ఎంత తాగాలి, ఎప్పుడు తాగాలంటే..
కొబ్బరి నీళ్లను రోజుకు ఒక గ్లాసు (సుమారు 200 నుంచి 250 మి.లీ.) తాజా కొబ్బరి నీళ్లు తాగితే సరిపోతుందన్నారు. ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తాగడం అత్యంత ఉత్తమం అని చెప్పారు. వీలైనంత వరకు నిల్వ ఉన్న ప్యాకెట్ నీళ్ల కంటే తాజా కొబ్బరి బొండం నీటికే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. బరువు తగ్గాలనుకునే వారికి కొబ్బరి నీళ్లు ఉత్తమ ఎంపిక, వీటిలో విటమిన్లు, ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయని వెల్లడించారు. షూగర్, తీవ్రమైన కిడ్నీ సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్లను తీసుకునే ముందు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలని చెప్పారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




