Dry Cough : రాత్రిపూట వచ్చే పొడి దగ్గును ఆపండి.. నిద్రకు భంగం కలిగించే సమస్యకు సింపుల్ పరిష్కారాలు

Dry Cough : రాత్రిపూట వచ్చే పొడి దగ్గును ఆపండి.. నిద్రకు భంగం కలిగించే సమస్యకు సింపుల్ పరిష్కారాలు
x

Dry Cough : రాత్రిపూట వచ్చే పొడి దగ్గును ఆపండి.. నిద్రకు భంగం కలిగించే సమస్యకు సింపుల్ పరిష్కారాలు

Highlights

వాతావరణం మారగానే సాధారణంగా కనిపించే సమస్యలలో పొడి దగ్గు ఒకటి. కఫం లేదా శ్లేష్మం లేకుండా వచ్చే ఈ దగ్గు గొంతులో నొప్పి, పొడిదనం, తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

Dry Cough : వాతావరణం మారగానే సాధారణంగా కనిపించే సమస్యలలో పొడి దగ్గు ఒకటి. కఫం లేదా శ్లేష్మం లేకుండా వచ్చే ఈ దగ్గు గొంతులో నొప్పి, పొడిదనం, తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా రాత్రిపూట వచ్చే ఈ దగ్గు నిద్రకు తీవ్ర అంతరాయం కలిగిస్తుంది. అందుకే తరచుగా వచ్చే ఈ పొడి దగ్గును తగ్గించుకోవడానికి మందుల కంటే కూడా, ఇంట్లో సులభంగా తయారుచేసుకోగలిగే కొన్ని సహజమైన ఇంటి చిట్కాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ దగ్గు రావడానికి గల కారణాలు, లక్షణాలు, తక్షణ ఉపశమనం కోసం ప్రయత్నించాల్సిన చిట్కాలు ఏమిటో తెలుసుకుందాం.

పొడి దగ్గులో కఫం లేదా శ్లేష్మం ఉండదు. ఇది గొంతులో పొడిదనం, నొప్పి, చికాకును కలిగిస్తుంది. దీనికి ప్రధాన కారణాలు దుమ్ము, పరాగ రేణువులు లేదా ఇతర అలర్జీ కారకాల వల్ల, ముక్కు వెనుక భాగం నుంచి శ్లేష్మం గొంతులోకి కారడం. గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి కారణంగా కడుపులోని ఆమ్లం పైకి రావడం. శ్వాసకోశ సమస్యలు, పొగతాగడం, కొన్ని రకాల మందులు, వైరల్ ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు.

పొడి దగ్గు లక్షణాలను తగ్గించడానికి, మొదట బాగా నీరు తాగడం చాలా ముఖ్యం. అలాగే, ఈ ఇంటి చిట్కాలను ప్రయత్నించవచ్చు:

తేనె, నిమ్మరసం :

తేనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు పొడి దగ్గును తగ్గించడానికి సహాయపడతాయి. నిమ్మలో ఉండే విటమిన్ సి ప్రయోజనకరం.రెండు చెంచాల నిమ్మరసంలో ఒక చెంచా తేనె కలిపి తీసుకోవడం వల్ల గొంతు నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

అల్లం టీ :

అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఒక కప్పు వేడి నీటిలో 20-30 గ్రాముల తురిమిన అల్లం వేసి, దానికి కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలిపి టీ లాగా తాగాలి. ఈ టీ దగ్గును తగ్గించి, ఉపశమనం ఇస్తుంది.

దానిమ్మ తొక్క:

దానిమ్మ తొక్కలు కూడా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. వీటిని వేడి నీటిలో ఉడికించి ఆ నీటిని తాగడం వల్ల దగ్గుతో పాటు, ఎక్కిళ్లకు కూడా ఉపశమనం లభిస్తుంది.

లవంగాలు :

నాలుగు నుంచి ఐదు లవంగాలను తీసుకుని, వాటిని నోటిలో ఉంచుకుని, గంటల తరబడి నెమ్మదిగా నమలడం వల్ల పొడి దగ్గు నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories