బాడీ షేప్ గురించి బాధ పడుతున్నారా? ఇది తెలుసుకోండి!

బాడీ షేప్ గురించి బాధ పడుతున్నారా? ఇది తెలుసుకోండి!
x

బాడీ షేప్ గురించి బాధ పడుతున్నారా? ఇది తెలుసుకోండి!

Highlights

కాస్త బొద్దుగా లేదా మరీ సన్నగా ఉంటే.. ఎవరు, ఎలాంటి కామెంట్స్ చేస్తారో అన్న భయం ఉంటుంది చాలామందిలో. పొరపాటున ఎవరైనా కామెంట్ చేస్తే ఇక అంతే సంగతి.

కాస్త బొద్దుగా లేదా మరీ సన్నగా ఉంటే.. ఎవరు, ఎలాంటి కామెంట్స్ చేస్తారో అన్న భయం ఉంటుంది చాలామందిలో. పొరపాటున ఎవరైనా కామెంట్ చేస్తే ఇక అంతే సంగతి. మానసికంగా లోలోపల కుంగిపోతుంటారు. కానీ మనశరీరాన్ని మనం నిజంగా ప్రేమించినప్పుడు ఇలా జరగదు. మన శరీరంపై మనకు ఇష్టం ఉన్నప్పుడు ఎవరేమనుకున్నా.. దానికి బాధపడాల్సిన పని ఉండదు. దీన్నే ‘బాడీ పాజిటివిటీ’ అంటారు. ఇదెలా అలవాటు చేసుకోవాలంటే..

అందంగా కనిపించడం అంటే అలాగో, ఇలాగో ఉండాలని కొన్ని రూల్స్ పెట్టుకుంటారు చాలామంది. అద్దంలో చూసుకుని ‘నేను ఇలా లేను, అలా లేను’ అనుకుంటూ మానసికంగా కుంగిపోతుంటారు. శరీరం, అందం గురించి పదే పదే ఆలోచిస్తూ బాధపడటాన్ని ‘పూర్‌ బాడీఇమేజ్‌’ అంటారు. సినిమాలు, సోషల్ మీడియాల వల్ల చాలామంది ఇలాంటి పూర్ బాడీ ఇమేజ్‌కు లోనవుతుంటారు. కానీ మన శరీరంపై మనకు ఉండాల్సింది పూర్ బాడీ ఇమేజ్ కాదు. పాజిటివిటీ. అదే ప్రేమ.

బాడీ పాజిటివిటీ అంటే.. మన శరీరాన్ని మనం పాజిటివ్‌గా ఫీలవ్వడం. మన శరీరాన్ని, ఆకృతిని,అందాన్ని మనఃస్ఫూర్తిగా ప్రేమించడం. మనం ఎలా ఉన్నామో అలానే దాన్ని అంగీకరించడం. ఈ బాడీ పాజిటివిటీని పెంచుకోవడానికి కొంత ప్రాక్టీస్ కావాలి. కొన్ని సింపుల్ టెక్నిక్స్ ద్వారా మన శరీరంపై ప్రేమను ఇట్టే పెంచుకోవచ్చు.

అద్దంతో స్నేహం

అప్పుడప్పుడు కొన్ని పనులు అద్దం ముందు నిల్చొని చేయడం వల్ల శరీరంపై అవగాహన పెరుగుతుంది. మన శరీరంపై మనకున్న సిగ్గు, భయం లాంటివి పోయి.. ఉన్నదున్నట్టు యాక్సెప్ట్ చేసే ధోరణి అలవాటవుతుంది.

గ్రాటిట్యూడ్

గ్రాటిట్యూడ్ అన్నింటికంటే ముఖ్యమైన లక్షణం. గ్రాటిట్యూడ్ అంటే మనకున్న వాటిపై కృతజ్ఞతగా ఉండడం, ప్రకృతి మనకిచ్చిన శరీరం, ఆరోగ్యం, తెలివి తేటలు అలాగే చుట్టూ ఉన్న సొసైటీ, స్నేహితులు, బంధువులు ఇలా మనకు ఉన్న వాటన్నింటి పట్ల థ్యాంక్‌ఫుల్‌గా ఉండడం వల్ల నెగెటివిటీ పూర్తిగా తగ్గిపోతుంది.

కొన్ని టిప్స్ ఇవీ..

మొటిమలు, మచ్చలు చూసుకుని చాలామంది బాధపడతుంటారు. అవన్నీ సహజంగా వచ్చేవే అని అర్థం చేసుకోవాలి. పట్టించుకోవాల్సిన పెద్ద విషయాలు కాదని గుర్తించాలి.

ప్రొఫైల్ ఫొటోల్లో సొంత ఫొటో పెట్టుకోడానికి సిగ్గు పడకూడదు. ఎవరో ఏదో అనుకుంటారన్న భావనను వదిలేయాలి. ఇతరులతో పోల్చుకోవడాన్ని పూర్తిగా మానుకోవాలి. అలాగే అతిగా మేకప్‌ వేసుకోవడం, ఫొటోల్లో తెల్లగా ఎడిటింగ్‌ చేసుకోవడం కూడా మానుకోవాలి.

పిల్లల్ని కూడా చిన్నప్పటి నుంచీ లావు, సన్నం అని కాకుండా ఆరోగ్యంగా ఉన్నారా? లేదా? అనేది చూసుకోవాలి. వాళ్లలో కూడా అలాంటి భావననే పెంపొందించాలి.

బాడీ పాజిటివిటీని పెంచుకోవాలంటే.. వేసుకునే బట్టల్ని సరిగ్గా ఎంచుకోవాలి. ఫ్యాషన్‌వేర్‌‌కు బదులు శరీరాకృతికి నప్పే బట్టలు, శరీరానికి కంఫర్టబుల్‌గా ఉండే బట్టలు ఎంచుకోవాలి.

వ్యాయామానికి శరీరం సహకరించకపోతే.. దాన్ని నెగెటివ్‌గా తీసుకోకూడదు. శరీరానికి మరింత ట్రైనింగ్, స్ట్రెచింగ్ అవసరమని గుర్తించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories