Cancer Risk: ఒక్క పెగ్‌తోనే క్యాన్సర్ రిస్క్? మందుబాబులకు షాకింగ్ నిజాలు

Cancer Risk: ఒక్క పెగ్‌తోనే క్యాన్సర్ రిస్క్? మందుబాబులకు షాకింగ్ నిజాలు
x

 Cancer Risk: ఒక్క పెగ్‌తోనే క్యాన్సర్ రిస్క్? మందుబాబులకు షాకింగ్ నిజాలు

Highlights

Cancer Risk: వారానికి ఒక్క పెగ్ మద్యం తీసుకున్నా క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆల్కహాల్ సురక్షిత పరిమితి లేదని అధ్యయనాలు చెబుతున్నాయి.

Cancer Risk: మద్యం విషయంలో ‘వారానికి ఒక్క పెగ్ అయితే సేఫ్’ అన్న భావన పూర్తిగా తప్పని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. డాక్టర్ ఎర్నెస్ట్ హాక్ సహా పలువురు నిపుణుల ప్రకారం, మద్యం సేవించడంలో సురక్షితమైన పరిమితి అంటూ ఏదీ లేదని, వారానికి ఒక్క డ్రింక్ తీసుకున్నా క్యాన్సర్ ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.

అమెరికాలో 2019లో నమోదైన సుమారు 18 లక్షల క్యాన్సర్ కేసుల్లో దాదాపు లక్ష కేసులు మద్యం కారణంగానే సంభవించినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పొగాకు, రేడియేషన్‌ల మాదిరిగానే ఆల్కహాల్ కూడా శక్తివంతమైన ‘కార్సినోజెన్’గా వైద్య శాస్త్రం గుర్తించింది. అయినప్పటికీ, సగం మంది ప్రజలకు మద్యం వల్ల క్యాన్సర్ వస్తుందనే అవగాహన లేదని తాజా సర్వేలు చెబుతున్నాయి.

మద్యం శరీరంలోకి వెళ్లిన తర్వాత విచ్ఛిన్నం కావడంతో ‘అసిటాల్డిహైడ్’ అనే విషపదార్థం ఉత్పత్తి అవుతుంది. ఇది కణాల్లోని డీఎన్ఏను దెబ్బతీసి క్యాన్సర్‌కు దారి తీస్తుంది. అలాగే ఆల్కహాల్ వల్ల ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి పెరిగి ఇన్ఫ్లమేషన్ ఏర్పడుతుంది. హార్మోన్ల అసమతుల్యత, ముఖ్యంగా ఈస్ట్రోజెన్ స్థాయిల పెరుగుదల వల్ల మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మద్యం ప్రభావం పురుషుల కంటే మహిళలపై ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మహిళల్లో రోజుకు ఒక్క పెగ్ తీసుకున్నా క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతుండగా, పురుషుల్లో ఈ ప్రమాదం కొంత తక్కువగా ఉన్నప్పటికీ పూర్తిగా సురక్షితమని చెప్పలేమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఆరోగ్య రక్షణకు మద్యానికి దూరంగా ఉండటమే ఉత్తమ మార్గమని సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories