Lifestyle: అధిక చెమట వేధిస్తుందా.? ఈ సమస్య ఉన్నట్లే..

Excessive Sweating You Might Have Hyperhidrosis Causes Symptoms and Remedies
x

Lifestyle: అధిక చెమట వేధిస్తుందా.? ఈ సమస్య ఉన్నట్లే..

Highlights

Lifestyle: చెమట పట్టడం అనేది అత్యంత సాధారణమైన విషయం. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో సమాయపడే ప్రకియే చెమట పట్టడం.

Lifestyle: చెమట పట్టడం అనేది అత్యంత సాధారణమైన విషయం. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో సమాయపడే ప్రకియే చెమట పట్టడం. అయితే ఎలాంటి కారణం లేకుండా విపరీతంగా చెమట పడితే, అది హైపర్ హైడ్రోసిస్ అనే వ్యాధికి సంకేతం కావచ్చు. ఈ సమస్య ఎక్కువగా అరచేతులు, పాదాలు, చంకలు, ముఖం, తల వంటి ప్రాంతాల్లో కనిపిస్తుంది.

హైపర్ హైడ్రోసిస్ రకాలు:

ప్రైమరీ హైపర్ హైడ్రోసిస్:– ఇది స్వేద గ్రంథుల అధిక చురుకుదనంతో సంభవిస్తుంది. సాధారణంగా దీని వెనుక స్పష్టమైన కారణం ఉండదు, కానీ జన్యుపరమైన లక్షణంగా వచ్చే అవకాశం ఉంది.

సెకండరీ హైపర్ హైడ్రోసిస్: ఇతర ఆరోగ్య సమస్యలు లేదా వ్యాధుల వల్ల ఈ పరిస్థితి వస్తుంది. థైరాయిడ్ సమస్యలు, డయాబెటిస్, గుండె జబ్బులు, ఊబకాయం, ఇన్ఫెక్షన్లు మొదలైనవి దీనికి కారణమవుతాయి.

హైపర్ హైడ్రోసిస్ లక్షణాలు:

* ఎలాంటి శారీరక శ్రమ లేక పోయినా అధిక చెమట పట్టడం

* చల్లని వాతావరణంలో కూడా చెమటతో తడిసిపోవడం

* రాత్రిపూట ఎక్కువగా చెమట పట్టడం.

* శరీర దుర్వాసన పెరగడం వంటివి దీని లక్షణాలుగా చెప్పొచ్చు.

హైపర్ హైడ్రోసిస్ కు కారణాలు:

నాడీ వ్యవస్థ సమస్యలు, కుటుంబంలో ఎవరికైనా ఇప్పటికే ఈ వ్యాధి ఉన్నట్లయితే, మీకు వచ్చే అవకాశం పెరుగుతుంది. హైపర్ థైరాయిడిజం వల్ల శరీర జీవక్రియ పెరిగి అధిక చెమట ఉత్పత్తి అవుతుంది. అధిక బరువు లేదా ఊబకాయం వల్ల శరీరాన్ని చల్లబరిచేందుకు ఎక్కువ చెమట వస్తుంది.

పాటించాల్సిన చిట్కాలు:

* రోజుకు 7-8 గ్లాసుల నీరు తాగాలి.

* కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి వాటిని తరచూ తీసుకోవాలి.

* అధిక మసాలా పదార్థాలు, జంక్ ఫుడ్ తినడం తగ్గించాలి

* ఒత్తిడిని తగ్గించేందుకు యోగా, ధ్యానం, వంటివి అలవాటు చేసుకోవాలి.

* సింథటిక్ దుస్తులకు బదులుగా కాటన్ దుస్తులు ధరించాలి

* శరీర పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి యాంటీ బాక్టీరియల్ సబ్బుతో రోజుకు రెండు సార్లు స్నానం చేయడం మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories