Heart: మీ గుండెను కాపాడుకోవడానికి ప్రతిరోజూ ఈ ఆహారాలు తినండి

Food Items that are benefits for heart
x

Heart: మీ గుండెను కాపాడుకోవడానికి ప్రతిరోజూ ఈ ఆహారాలు తినండి

Highlights

Heart: మానిషి శరీరంలో గుండె చాలా ముఖ్యమైన అవయవం. కాబట్టి, గుండె ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. మనం తీసుకునే ఆహారం రుచికరంగా ఉండటమే కాకుండా హృదయ ఆరోగ్యాన్ని కాపాడుకునే ఉండాలి.

Heart: మానిషి శరీరంలో గుండె చాలా ముఖ్యమైన అవయవం. కాబట్టి, గుండె ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. మనం తీసుకునే ఆహారం రుచికరంగా ఉండటమే కాకుండా హృదయ ఆరోగ్యాన్ని కాపాడుకునే ఉండాలి. ఈ ఆరోగ్యకరమైన ఆహారాలు గుండె ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. వీటిని ప్రతిరోజూ తీసుకుంటూ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తృణధాన్యాలు: తృణధాన్యాలు గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఓట్స్, బార్లీ, మిల్లెట్, మొక్కజొన్నలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. బ్లూబెర్రీస్ లేదా స్ట్రాబెర్రీస్ వంటి తాజా బెర్రీలు కూడా గుండె ఆరోగ్యానికి మంచి చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, అదనపు ఫైబర్ కంటెంట్ కూడా లభిస్తుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడి, వాపును తగ్గించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.

గ్రీకు పెరుగు: గ్రీకు పెరుగులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. బాదం, వాల్‌నట్స్ లేదా పిస్తా వంటి మిశ్రమ గింజలతో దీన్ని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇది ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం వంటి ముఖ్యమైన సూక్ష్మపోషకాలను అందిస్తుంది.

అవకాడో: అవకాడోలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అదే సమయంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. కాబట్టి, క్రమం తప్పకుండా వీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

గుడ్డు: గుడ్డులోని తెల్లసొనను మిశ్రమ కూరగాయలతో తినడం వల్ల అధిక స్థాయిలో కొవ్వు, పోషకాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. పాలకూర, టమోటాలు వంటి వివిధ రకాల కూరగాయలతో తెల్లసోనను తినడం వల్ల భోజనంలో ఫైబర్, పోషకాలు పెరుగుతాయని అంటున్నారు. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా లభిస్తాయని అంటున్నారు.

అవిసె గింజలు: అరటిపండు, అవిసె గింజలు కూడా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో పొటాషియం, ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

పాలు: పాలను బాదం, తృణధాన్యాలతో కలిపి తాగితే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది కార్బోహైడ్రేట్‌లకు మంచి మూలం, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. గుండె, ఎముకల ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం, విటమిన్ డి ని ఇస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories