Workouts: జిమ్‌కు వెళ్తున్నారా? ఈ తప్పులు చేయొద్దు!

Workouts: జిమ్‌కు వెళ్తున్నారా? ఈ తప్పులు చేయొద్దు!
x

 Workouts: జిమ్‌కు వెళ్తున్నారా? ఈ తప్పులు చేయొద్దు!

Highlights

బాడీ షేప్ కోసం, బరువు తగ్గడం కోసం చాలామంది జిమ్‌కు వెళ్తుంటారు. అయితే జిమ్‌లో తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల రక్తపోటు, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

జిమ్‌తో ప్రమాదం

బాడీ షేప్ కోసం, బరువు తగ్గడం కోసం చాలామంది జిమ్‌కు వెళ్తుంటారు. అయితే జిమ్‌లో తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల రక్తపోటు, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జిమ్‌కు వెళ్లే వాళ్లు కొన్ని మిస్టేక్స్ చేయకుండా చూసుకోవాలి. అవేంటంటే..


వామప్ స్కిప్ చేస్తే..

జిమ్‌లో కష్టతరమైన వ్యాయామాలు చేసేముందు తప్పకుండా వామప్ చేయాలి. వామప్ చేయకుండా జిమ్ వర్కవుట్ల జోలికి వెళ్లకూడదు. ఒకేసారి భారీ వర్కవుట్లు చేయడం వల్ల శరీరంపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది.


అధిక బరువులు ఎత్తితే..

జిమ్‌కు వెళ్లే వాళ్లు బరువులు ఎత్తే విషయంలో జాగ్రత్త వహించాలి. పక్కవారితో పోల్చుకుని అధిక బరువులు ఎత్తే ప్రయత్నం చేయకూడదు. వెయిట్ ఎక్సర్‌‌సైజులు చేయాలనుకుంటే ముందు చిన్న వెయిట్స్‌తో ప్రారంభించాలి.


హైడ్రేషన్ ముఖ్యం

జిమ్‌కు వెళ్లేవాళ్లు చెమట రూపంలో ఎక్కువ నీటిని కోల్పోతారు. కాబట్టి రోజుకి నాలుగైదు లీటర్ల నీటిని తాగేలా చూసుకోవాలి. అలాగే జిమ్‌కు వెళ్లే ముందు, తర్వాత కూడా నీళ్లు తాగితే మంచిది.


నొప్పి కలిగితే..

జిమ్ వర్కవుట్స్ వల్ల ఏవైనా నొప్పులు వస్తుంటే దాన్ని అశ్రద్ధ చేయడం మంచిది కాదు. సాధారణ నొప్పులతోపాటు కొన్నిసార్లు కీళ్లు పట్టేసిన నొప్పులు కూడా రావొచ్చు. కాబట్టి నొప్పులతో వ్యాయామాలు చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.


డైట్ కీలకం

జిమ్‌కు వెళ్లేవాళ్లు ఎక్కువ క్యాలరీలను బర్న్ చేస్తారు. కాబట్టి తగినన్ని క్యాలరీలు తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే నీరసం, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. జిమ్‌కు వెళ్లే వాళ్లు డైట్ కూడా సరిగ్గా పాటిస్తేనే పూర్తి ఫలితం ఉంటుంది. అలాగే ప్రొటీన్ పౌడర్ల జోలికి వెళ్లకపోవడమే మంచిది.


ట్రైనర్ లేకుండా..

జిమ్ వర్కవుట్స్ చేసేవాళ్లు మంచి సర్టిఫైడ్ ట్రైనర్ ఉన్న జిమ్‌నే ఎంచుకోవాలి. మీ ఫిట్‌నెస్ గోల్‌ను బట్టి ట్రైనర్ సూచనల మేరకు వ్యాయామాలు చేయాలి. సొంత ప్రయత్నాలు చేయకూడదు.

Show Full Article
Print Article
Next Story
More Stories