30లో కూడా యంగ్‌గా ఉన్నామనుకుంటున్నారా? ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టెస్టులు తప్పనిసరి!

30లో కూడా యంగ్‌గా ఉన్నామనుకుంటున్నారా? ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టెస్టులు తప్పనిసరి!
x

30లో కూడా యంగ్‌గా ఉన్నామనుకుంటున్నారా? ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టెస్టులు తప్పనిసరి!

Highlights

30 ఏళ్లు దాటిన తర్వాత ఆరోగ్యంపై జీవనశైలి, ఆహారం, ఒత్తిడి ప్రభావం బాగా కనిపించసాగుతుంది. బయటకు ఫిట్‌గా కనిపించినా శరీరంలో నెమ్మదిగా ఆరోగ్య సమస్యలు మొదలవుతుంటాయి. ముఖ్యంగా బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఈ వయసు నుంచి సైలెంట్‌గా పెరిగిపోతుంటాయి. ఇవి ఆరంభ దశల్లోనే గుర్తించి జాగ్రత్తపడాలంటే ప్రతి ఒక్కరూ రెగ్యులర్‌గా హెల్త్ చెకప్ చేయించుకోవాలి.

ఎప్పుడు టెస్టులు చేయించుకోవాలి?

మీ ఆరోగ్య స్థితిని బట్టి పరీక్షల వ్యవధి మారుతుంది. ఆరోగ్యంగా ఉన్నవారు సంవత్సానికి ఒకసారి ఫుల్ బాడీ చెకప్ చేయించుకుంటే సరిపోతుంది. కానీ అధిక బరువు ఉన్నవారు, కుటుంబంలో ఆరోగ్య సమస్యల చరిత్ర ఉన్నవారు, ఎక్కువ ఒత్తిడికి గురయ్యేవారు ఆరు నెలలకోసారి పరీక్షలు చేయించుకోవడం మంచిది. మహిళలు గైనకాలజీ, పురుషులు ప్రోస్టేట్ సంబంధిత పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి.

ఎసెన్షియల్ హెల్త్ చెకప్స్

బీపీ & షుగర్ టెస్ట్: రక్తపోటు, గ్లూకోజ్ స్థాయిలను కనీసం ఆరు నెలలకోసారి పరీక్షించాలి. కుటుంబంలో డయాబెటిస్ చరిత్ర ఉంటే మరింత జాగ్రత్త అవసరం.

కొలెస్ట్రాల్ టెస్ట్: LDL, HDL, ట్రైగ్లిసరైడ్స్ స్థాయిలు సంవత్సరానికి ఒకసారి చెక్ చేయాలి.

లివర్, కిడ్నీ ఫంక్షన్ టెస్టులు: ఫ్యాటీ ఫుడ్స్, పెయిన్ కిల్లర్స్, మద్యపానం వాడకం వల్ల ఈ అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కనుక ఇవి సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా చెయ్యాలి.

థైరాయిడ్ టెస్ట్: అలసట, బరువు మార్పులు, మూడ్ స్వింగ్స్ వంటి లక్షణాలున్నా లేకపోయినా ప్రతి ఏడాది పరీక్షించాలి.

విటమిన్ D, B12: వీటి లోపం ఎముకలు బలహీనపడటానికి, మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. సంవత్సానికి ఒక్కసారైనా చెక్ చేయాలి.

క్యాన్సర్ స్క్రీనింగ్: 30 దాటిన మహిళలు ప్రతి 3 ఏళ్లకు ఒకసారి గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్, బ్రెస్ట్ స్క్రీనింగ్ చేయించాలి. పురుషులు ప్రోస్టేట్ సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.

ఎందుకు అవసరం?

హెల్త్ చెకప్స్ అనేవి భయపడాల్సినవల్లకాదు — ఇవి శరీరంలోని సమస్యలను ముందుగానే కనిపెట్టే శక్తివంతమైన సాధనాలు. శరీరం సమస్యలను మాటల్లో చెప్పదు కానీ సంకేతాల రూపంలో చెబుతుంది. వాటిని గుర్తించటం మన బాధ్యత.

Bottom Line:

30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని లైట్‌గా తీసుకోకుండా.. రెగ్యులర్‌గా చెకప్ చేయించుకుంటూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించండి.

గమనిక: ఈ సమాచారం జనరల్ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే డాక్టర్‌ను సంప్రదించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories