Black Sesame Seeds Benefits: ఎముకలు ఉక్కులా మారాలా? జుట్టు రాలడం ఆగిపోవాలా? అయితే ఈ నల్లటి గింజలే మీకు బెస్ట్ మెడిసిన్!

Black Sesame Seeds Benefits
x

Black Sesame Seeds Benefits: ఎముకలు ఉక్కులా మారాలా? జుట్టు రాలడం ఆగిపోవాలా? అయితే ఈ నల్లటి గింజలే మీకు బెస్ట్ మెడిసిన్!

Highlights

Black Sesame Seeds Benefits: నల్ల నువ్వులతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు! ఎముకలు గట్టిపడాలన్నా, జుట్టు రాలడం తగ్గాలన్నా రోజూ కొద్దిగా నల్ల నువ్వులు తింటే చాలు. కాల్షియం లోపాన్ని దూరం చేసే ఈ సూపర్ ఫుడ్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ..

Black Sesame Seeds Benefits: మన శరీరంలో కాల్షియం స్థాయిలు తగ్గితే మొదట చిన్న నొప్పులే కదా అని లైట్ తీసుకుంటాం. కానీ అదే తర్వాత కీళ్ల నొప్పులు, మోకాళ్ల సమస్యలు, విపరీతమైన నడుము నొప్పికి దారితీస్తుంది. సాధారణంగా కాల్షియం అంటే ఎముకలకే అనుకుంటారు, కానీ కండరాల కదలికలకు, గుండె రిథమ్ సరిగ్గా ఉండటానికి కూడా ఇది చాలా అవసరం. అయితే, మాత్రల అవసరం లేకుండా సహజంగా కాల్షియం పెంచుకోవాలంటే మన వంటగదిలోని నల్ల నువ్వులు ఒక అద్భుతమైన మందులా పనిచేస్తాయి.

నల్ల నువ్వులతో కలిగే అద్భుత ప్రయోజనాలు:

1. ఎముకలకు వజ్రాయుధం:

నల్ల నువ్వుల్లో కాల్షియం, మాగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా చేస్తాయి. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి, నడుము నొప్పి ఉన్నవారికి ఇవి నేచురల్ టానిక్‌లా పనిచేస్తాయి.

2. జుట్టు రాలడానికి చెక్:

జుట్టు సమస్యలతో ఇబ్బంది పడేవారికి నల్ల నువ్వులు గొప్ప వరం. ఇవి జుట్టు కుదుళ్లను బలపరుస్తాయి. చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును నివారించడంతో పాటు, స్కాల్ప్‌లో డాండ్రఫ్ రాకుండా చేస్తాయి. ఇందులో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకు లోపలి నుంచి పోషణ ఇస్తాయి.

3. రక్తహీనత నివారణ:

ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో హీమోగ్లోబిన్ లెవెల్స్ మెరుగుపడతాయి. రక్తహీనత (Anemia) ఉన్నవారు వీటిని తీసుకోవడం వల్ల రక్తం వృద్ధి చెందుతుంది.

4. జీర్ణక్రియ మెరుగుదల:

నల్ల నువ్వుల్లో పీచు పదార్థం (Fiber) అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను దూరం చేసి, గట్ హెల్త్‌ను మెరుగుపరుస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తీసుకుంటే మెటబాలిజం యాక్టివ్ అవుతుంది.

5. గుండె ఆరోగ్యం & మహిళల సమస్యలు:

ఇవి కొలెస్ట్రాల్‌ను నియంత్రించి, రక్తపోటును (BP) తగ్గిస్తాయి. అలాగే మహిళల్లో పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని, డెలివరీ తర్వాత వచ్చే బలహీనతను తగ్గించడంలో ఇవి కీలకంగా పనిచేస్తాయి.

ఎలా తీసుకోవాలి?

రోజుకు 10 నుండి 20 గ్రాముల నువ్వులు సరిపోతాయి.

♦ వీటిని నేరుగా నమిలి తినొచ్చు లేదా కొద్దిగా వేయించి తేనెతో కలిపి తీసుకోవచ్చు.

♦ పొడిలా చేసి అన్నంలో కలుపుకోవచ్చు లేదా నువ్వుల లడ్డు రూపంలోనూ తీసుకోవచ్చు.

గమనిక: నువ్వులకు వేడి చేసే గుణం ఉంటుంది. కాబట్టి వీటిని అతిగా తీసుకోకూడదు. ఎక్కువగా తీసుకుంటే నోటి పూత వచ్చే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories