HealthTips: బరువు తగ్గడానికి జిమ్‌కి వెళ్తున్నారా? రోజూ ఉదయం ఈ ఒక్క పని చేయండి చాలు!

HealthTips: బరువు తగ్గడానికి జిమ్‌కి వెళ్తున్నారా? రోజూ ఉదయం ఈ ఒక్క పని చేయండి చాలు!
x
Highlights

HealthTips: బాదం, వాల్‌నట్ వంటి డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి అని అందరికీ తెలుసు. అయితే, ఈ ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్ జాబితాలో అంజీర్ కూడా చేర్చుకోవాలని చాలామంది మర్చిపోతుంటారు.

HealthTips: బాదం, వాల్‌నట్ వంటి డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి అని అందరికీ తెలుసు. అయితే, ఈ ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్ జాబితాలో అంజీర్ కూడా చేర్చుకోవాలని చాలామంది మర్చిపోతుంటారు. అంజీర్ పండ్లు మన శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అంతేకాకుండా వీటిలో పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. వీటిలో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మలబద్ధకం వంటి సమస్యలను నివారించడానికి సహాయపడతాయి. ఈ అంజీర్ పండ్లను మీరు ఏ విధంగానైనా తినవచ్చు. అయితే, ఆయుర్వేదం, పోషకాహార నిపుణుల ప్రకారం.. వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినడం వలన మంచి ప్రయోజనాలు లభిస్తాయి. ఎండుద్రాక్ష మాదిరిగానే, వీటిని కొన్ని రోజులు తింటే మీ ఆరోగ్యంలో గణనీయమైన మార్పును మీరు గమనిస్తారు. మరి దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? ఎందుకు తినాలి? అనేది వివరంగా తెలుసుకుందాం.

రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తుంది

అంజీర్ పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసేందుకు సహాయపడుతుంది. అంజీర్ పండ్లలో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ కూడా రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గిస్తుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి. అదనంగా, నానబెట్టిన అంజీర్ పండ్లను తినడం వల్ల టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో రక్త గ్లూకోజ్ లెవల్ కంట్రోల్ చేసేందుకు కూడా సహాయపడుతుంది.

మలబద్ధకాన్ని తగ్గిస్తుంది

అంజీర్ పండ్లు ఫైబర్, యాంటీఆక్సిడెంట్ల‌తో సమృద్ధిగా ఉంటాయి. ఇవి మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా అంజీర్ పండ్లు తినాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తారు. మలబద్ధకంతో బాధపడుతున్న వారు నానబెట్టిన అంజీర్ పండ్లను తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందుతారు.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

ఈ రోజుల్లో చాలామంది బరువు పెరగడం గురించి ఎక్కువగా చింతిస్తున్నారు. వారు బరువు తగ్గడానికి జిమ్‌కి వెళ్లడం నుండి ఆహార నియమాలు పాటించడం వరకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, ఖాళీ కడుపుతో నానబెట్టిన అంజీర్ పండ్లను తినడం వల్ల ఈ సమస్యకు సులభంగా పరిష్కారం లభిస్తుంది.

ఎముకలను బలోపేతం చేస్తుంది

అంజీర్ పండ్లలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉంటాయి. ఎముకలను బలోపేతం చేయడానికి పాలు ఎంత ప్రయోజనకరమో, అంజీర్ కూడా అంతే ప్రయోజనకరం. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన అంజీర్ పండ్లను తినడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి.

రక్తపోటును నియంత్రిస్తుంది

అంజీర్ పండ్లలో మంచి మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. అదనంగా, ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. తద్వారా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories