Desk Job Health Risks : వర్క్ ఫ్రమ్ హోమ్ అలర్ట్..గంటల తరబడి కూర్చుంటే 10 వేల అడుగులు నడిచినా వృథా

Desk Job Health Risks : వర్క్ ఫ్రమ్ హోమ్ అలర్ట్..గంటల తరబడి కూర్చుంటే 10 వేల అడుగులు నడిచినా వృథా
x

Desk Job Health Risks : వర్క్ ఫ్రమ్ హోమ్ అలర్ట్..గంటల తరబడి కూర్చుంటే 10 వేల అడుగులు నడిచినా వృథా

Highlights

మీరు ఇంట్లో కూర్చుని పనిచేసినా లేదా ఆఫీస్‌లో గంటల తరబడి కదలకుండా ఉన్నా ఈ వార్త తప్పకుండా చదవండి.

Desk Job Health Risks : మీరు ఇంట్లో కూర్చుని పనిచేసినా లేదా ఆఫీస్‌లో గంటల తరబడి కదలకుండా ఉన్నా ఈ వార్త తప్పకుండా చదవండి. రోజువారీ జీవితంలో ఎక్కువ సమయం కూర్చుని గడిపే వారికి, ఆ తర్వాత ఆరోగ్యంగా ఉండటానికి 10,000 అడుగులు నడిచేవారికి డాక్టర్లు ఓ ముఖ్య సలహా ఇచ్చారు. ఆయన ప్రకారం ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం అనేది పొగతాగడం అంత హానికరం. అంతేకాదు, రోజంతా కూర్చొని, ఆ తర్వాత గంటల తరబడి నడవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అంతకుముందు జరిగిన హానిని కూడా నియంత్రించడం కష్టమని వారు చెబుతున్నారు.

కూర్చుని పనిచేసే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలని చెబుతున్నారు. మీరు గంటల తరబడి కూర్చుని, ఆ తర్వాత 10,000 స్టెప్స్ నడిచినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఒకే చోట కూర్చుంటే, మీ రక్తనాళాలు అప్పటికే దెబ్బతిని ఉంటాయి. అందుకే నడకతో ఉపయోగం ఉండదని డాక్టర్లు తెలిపారు. దీనికి బదులుగా రోజువారీ దినచర్యలో చిన్న చిన్న ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

శరీరంలో రక్త ప్రసరణ అనేది మీరు ఎంత నడిచారు అనే దానిపై ఆధారపడదు, బదులుగా మీరు కూర్చున్న చోటు నుంచి ఎన్నిసార్లు కదిలారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకే చోట ఎక్కువసేపు కూర్చుంటే రక్తం నిలిచిపోవడం జరుగుతుంది. దీని కారణంగా రక్తనాళాల్లోని కవాటాలు బలహీనపడతాయి. కాళ్లు వాపుకు గురవుతాయి. ఉబ్బిన రక్తనాళాలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా ఎక్కువ అవుతుంది.

నిశ్చలత్వం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి డాక్టర్ కొన్ని చిట్కాలను ఇచ్చారు. ఈ చిన్న విరామాలే మీ ఆరోగ్యానికి పెద్ద తేడాను చూపిస్తాయని ఆయన అంటున్నారు. ప్రతి 45 నుంచి 60 నిమిషాలకు ఒకసారి తప్పకుండా కుర్చీలోంచి లేచి నిలబడండి. కండరాలు పట్టేయకుండా ఉండటానికి స్ట్రెచింగ్ చేయండి. ప్రతిసారి లేచినప్పుడు కనీసం 2 నిమిషాలు అటూ ఇటూ నడవండి. ప్రతి 30 నిమిషాలకు ఒకసారి, కూర్చున్న చోటు నుంచే హీల్ రైస్ అనే చిన్న వ్యాయామాన్ని చేయండి. రక్తనాళాలకు మారథాన్‌లు అవసరం లేదు, వాటికి కావలసింది కేవలం కదలిక మాత్రమే అని డాక్టర్లు గట్టిగా చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories