Health Tips: రోజుకు ఒక యాపిల్ తింటే.. డాక్టర్‌‌ దగ్గరకు వెళ్లవలసిన పని లేదా?

Health Tips
x

Health Tips: రోజుకు ఒక యాపిల్ తింటే.. డాక్టర్‌‌ దగ్గరకు వెళ్లవలసిన పని లేదా?

Highlights

Health Tips: ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచి వినే మాట రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్‌‌తో అవసరం ఉండదని. నిజంగా ఇది నిజమేనా. యాపిల్ తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా? ఈ నానుడిలో ఎంత వాస్తవం ఉందో ఇప్పుడు చూద్దాం.

Health Tips: ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచి వినే మాట రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్‌‌తో అవసరం ఉండదని. నిజంగా ఇది నిజమేనా. యాపిల్ తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా? ఈ నానుడిలో ఎంత వాస్తవం ఉందో ఇప్పుడు చూద్దాం.

యాపిల్‌లో విటమిన్లు, మినరల్స్, యాంటీయాక్సిడెంట్లు, ఫైబర్ .. ఇలాంటివెన్నో పోషకాలు ఉన్నాయి. అందుకే ఆరోగ్యానికి చాలా మంచి ఆహారం అని డాక్టర్లు చెబుతుంటారు.

పవర్ హౌస్

యాపిల్‌ని పోషకాల పవర్ హౌస్ అని కూడా పిలుస్తారు. ఇందులో ఉన్నని పోషకాలు మరే పండులో లేవు. ముఖ్యంగా యాపిల్‌లో పుష్కలంగా సి విటమిన్ ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. అంతేకాదు ఇందులో ఉంటే కొల్లాజెన్ శరీరాన్ని తాజాగా ఉంచుతుంది. ఇక గుండె సంబంధిత వ్యాధులు, బీపీలను కంట్రోల్ చేయాలంటే యాపిల్ తినాల్సిందే. ఎందుకంటే ఇందులో ఎక్కువగా పోటాషియం కూడా ఉంటుంది.

జీర్ణక్రియ

యాపిల్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రతిరోజూ తినడం వల్ల శరీరంలో కావాల్సినంత ఫైబర్ అందుతుంది. దీని వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. మలబద్దకం వంటి సమస్యలు ఉండవు. బరువు తగ్గాలనుకునేవారు వారి డైట్‌లో కచ్చితంగా యాపిల్ ఉండేలా చూసుకోవాలి.

వ్యాధులకు మంచి మెడిసిన్

గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటీస్, కొన్ని రకాల క్యాన్సర్లు ఉన్నవారు కచ్చితంగా యాపిల్ తినాలి. యాపిల్ ఉండే క్వెర్సెటిన్, ఫ్లేవనాయిడ్స్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఇన్ ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. అంతేకాదు చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలోనూ, హార్ట్ ఎటాక్స్ రాకుండా చూడటంలోనూ ఇది ఒక మంచి మెడిసిన్‌లా పనిచేస్తుంది.

చక్కెర స్థాయిలు తగ్గాలంటే..

డయాబెటీస్ ఉన్నవాళ్లు యాపిల్ తింటే చాలామంచిది. ఎందుకంటే ఇది చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. అయితే వీరు రోజుకు సగం యాపిల్ మాత్రమే తినాలి. దీనివల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. అదేవిధంగా షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉంటాయి.

రోజుకు ఒక యాపిల్ తింటే మంచిదే

రోజుకొక యాపిల్ తినడం వల్ల డాక్టర్‌‌ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదన్నది వాస్తవం. ఎందుకంటే యాపిల్‌లో ఉండే పోషకాలు మరే ఇతర పండులో కనిపించవు. పైగా ఈజీగా జీర్ణక్రియ అయ్యే పండు కూడా. దీన్ని మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో ఒక యాపిల్ తినొచ్చు. అలాగే యుక్తవయసులో ఉన్నవాళ్లు సలాడ్స్ లో వీటిని వేసుకుని తినొచ్చు. ఓట్స్‌తో కలిపి తినడం వల్ల శరీర బరువు తగ్గుతారు. ఎప్పుడు తిన్నా ఎలా తిన్నా రోజుకో యాపిల్ తింటే మాత్రం మీ ఆరోగ్యానికి డోకా ఉండదు.

Show Full Article
Print Article
Next Story
More Stories