Health Tips: పీరియడ్స్ వచ్చే ముందే మీ పిల్లలు అలసిపోతున్నారా?

Health Tips
x

Health Tips: పీరియడ్స్ వచ్చే ముందే మీ పిల్లలు అలసిపోతున్నారా?

Highlights

Health Tips: చాలామంది పిల్లలు పీరియడ్స్ రాక ముందు నుంచే చాలా నీరసం అయిపోతుంటారు. ఏ పని చేయలేరు. చదవడానికి ఓపిక ఉండదు. కనీసం ఆడుకోడానికి కూడా వీళ్లు ఆసక్తి చూపించరు.

Health Tips: చాలామంది పిల్లలు పీరియడ్స్ రాక ముందు నుంచే చాలా నీరసం అయిపోతుంటారు. ఏ పని చేయలేరు. చదవడానికి ఓపిక ఉండదు. కనీసం ఆడుకోడానికి కూడా వీళ్లు ఆసక్తి చూపించరు. ఇలా మీ పిల్లలు కూడా పీరియడ్స్ వచ్చే ముందు ఉంటే కొన్ని రకాల ఆహార పదార్దాలను వారికి ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆహార పదార్ధాలు ఇవ్వడం వల్ల పీరియడ్స్ వచ్చే ముందు.. వచ్చిన తర్వాత కూడా పిల్లలు ఆరోగ్యంగా.. ఉల్లాసంగా ఉంటారని అంటున్నారు.

తలనొప్పి, కాళ్ల నొప్పి, పొత్తి కడుపులో నొప్పి, ఎక్కువ నీరసం, ఓపిక ఉండదు.. పీరియడ్స్ వచ్చే ముందు చాలా మంది బాలికలు ఎదుర్కునే సమస్మలు ఇవి. అయితే కొన్ని రకాల ఆహార పదార్దాలు పీరియడ్స్ వస్తాయనగా ఒక వారం రోజుల ముందు నుంచి ఇస్తే.. వారి శరీరంగా బలంగా మారుతుంది. దీనివల్ల అలసట అనేది ఉండదని నిపుణులు చెబుతున్నారు.

నువ్వులు, బెల్లం

పీరియడ్స్ వచ్చే వారం రోజుల ముందు ప్రతిరోజు క్రమం తప్పకుండా నువ్వులు, బెల్లంతో చేసిన ఉండలు పిల్లలకు ఇవ్వాలి. ఇందులో ఉండే ఐరన్ పిల్లలకు నీరసం రాకుండా చేస్తుంది. నూనె లేకుండా పెనంపై నువ్వులు వేయించి, వాడిని పొడి చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత బెల్లాన్ని పొడి చేసి ఒక కప్పు బెల్లంలో ఒక కప్పు నీళ్లు పోసి మరిగించాలి. ఒక ఐదు నిమిషాల పాటు మరిగించిన తర్వాత ఒక కప్పు నువ్వుల పొడిని వేసి కలపాలి. ఇది మీరు ఉండలుగా అయినా ఇవ్వొచ్చు లేదంటే ఒక గిన్నెలో వేసుకుని తినొచ్చు.

కొబ్బరి, బెల్లం

ప్రతి రోజు సాయంత్రం వేళలో కొబ్బరి, బెల్లం కలిపి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రెండింటినీ నేరుగా కలిపి తినొచ్చు. లేదా ఒక కప్పు బెల్లం తీసుకుంటే, దాన్ని పొడి చేసి, అందులో కొన్ని నీళ్లు పోసి స్టవ్ పై పెట్టి మరిగించాలి. ఇందులో కొబ్బరి తురుముని వేసి, అలాగే కొంచెం యాలకుల పొడి వేసి కలపాలి. దీన్ని ప్రతిరోజూ తినడం వల్ల పిల్లల్లో ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది.

ఆవిరి వంటలు

ఇడ్లీ, కుడుములు, పిట్టి వంటి కొన్ని రకాల ఆవిరిపైన చేసే ఆహారపదార్దాలు పీరియడ్స్ వచ్చే ముందు పిల్లలకు ఇవ్వాలి. వీటివల్ల శరీరం చాలా తేలికగా ఉంటుంది. పైగా నూనెతో చేయరు కాబట్టి.. ఆ సమయంలో తినాలని అనిపిస్తుంది. పైగా ఆవిరిపైన చేసిన వంటలు తింటే శరీరానికి అదనపు శక్తి వస్తుంది.

కూరగాయలు, పండ్లు

పీరియడ్స్ వచ్చే ముందు, పీరియడ్స్ వచ్చిన తర్వాత పిల్లలకు తాజా పండ్లు, కూరగాయలు ఇవ్వాలి. వీటితో చేసిన సలాడ్ ఇవ్వడం వల్ల శరీరంలో కొత్త ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. అంతేకాదు ఈ సమయంలో కూరగాయలతో చేసిన వేపుడు కూరలు పిల్లలకు పెట్టకూడదు. గ్రేవీలాంటి కూరగాయలు ఇవ్వాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories