
Health tips: తెల్లజుట్టుకు బైబై.. వంటింటి చిట్కాలతో నల్లని మెరిసే జుట్టు!
Health tips: ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య 'తెల్లజుట్టు'.
ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య 'తెల్లజుట్టు'. చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడంతో చాలా మంది ఆత్మన్యూనతకు లోనవ్వడమే కాకుండా, ఎగతాళికి గురవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నించి విఫలం అవుతున్నారు. నిజానికి మార్కెట్లో దొరికే రసాయన రంగుల జోలికి వెళ్లకుండా, వంటింటి చిట్కాలతోనే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ స్టోరీలో వంటింటి చిట్కాలతో తెల్ల జుట్టు సమస్యకు ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసుకుందాం.
జుట్టు ఎందుకు తెల్లబడుతుందంటే..
జుట్టు తెల్లబడటానికి కేవలం వయసు మాత్రమే కారణం కాదు, దీని వెనుక అనేక అంశాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆరోగ్య నిపుణులు మాట్లాడుతూ.. జుట్టు తెల్లబడటానికి జన్యుపరమైన కారణాలు, అధిక స్ట్రెస్, సరైన ఆహారం తీసుకోకపోవడం, విటమిన్ల కొరత, గాఢత గల షాంపూలు, హెయిర్ కలర్స్ ఉపయోగించడం వంటివి కారణం అవుతున్నాయని వివరించారు.
సమస్యకు ఇలా చెక్ పెట్టండి..
వైద్య నిపుణులు మాట్లాడుతూ.. వంటింట్లో ఉండే పటికతో తెల్లజుట్టు సమస్యకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు. పటికలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వివరించారు. ఇది కేవలం రంగును మార్చడమే కాకుండా చుండ్రు, తలలో దురద వంటి సమస్యలను కూడా తగ్గిస్తుందని అన్నారు. జుట్టును మూలాల నుంచి శుభ్రం చేసి, జుట్టు రాలడం తగ్గించేలా చేస్తుందని వెల్లడించారు.
ఈ సహజ సిద్ధమైన ద్రావణాన్ని మీ ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు..
దీనికి కావలసిన పదార్థాలు:
* పటిక పొడి (లేదా మెత్తగా దంచిన పటిక రాయి)
* ఉసిరి పొడి (Amla Powder)
* కరివేపాకు
* నిమ్మరసం
* నీరు
ముందుగా ఒక గిన్నెలో నీరు తీసుకుని అందులో పటిక పొడి, ఉసిరి పొడి, కరివేపాకు వేయండి. ఈ మిశ్రమానికి కొద్దిగా నిమ్మరసం కలిపి బాగా మరిగించండి. ఈ ద్రావణం చల్లారిన తర్వాత, సాధారణ షాంపూకు బదులుగా ఈ నీటితో జుట్టును శుభ్రం చేసుకోండి. ఈ పద్ధతిని క్రమం తప్పకుండా పాటించడం వల్ల అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. తెల్లబడిన జుట్టు క్రమంగా సహజమైన నలుపు రంగులోకి మారుతుందని పేర్కొన్నారు. దీనిని క్రమం తప్పకుండా కొనసాగిస్తే జుట్టు మూలాల నుంచి దృఢంగా తయారవుతుందని వివరించారు. అలాగే జుట్టు నాణ్యత (Texture) మెరుగుపడి మెరుస్తూ కనిపిస్తుందని చెప్పారు.
గమనిక: ఏదైనా కొత్త చిట్కాను పాటించే ముందు మీ చర్మ తత్వానికి అది సరిపోతుందో లేదో 'ప్యాచ్ టెస్ట్' ద్వారా నిర్ధారించుకోవడం ఉత్తమం.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




