Almond: బాదంపప్పుతో ఈ ఆహారాలు తింటే వెరీ డేంజర్

Almond
x

Almond: బాదంపప్పుతో ఈ ఆహారాలు తింటే వెరీ డేంజర్

Highlights

Almond: బాదంపప్పు (Almonds) ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. దీనిలో ఉన్న మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్, ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడతాయి.

Almond: బాదంపప్పు (Almonds) ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. దీనిలో ఉన్న మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్, ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడతాయి. ఇది గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. బాదంపప్పులో ఉన్న పొటాషియం, కేల్షియం, మాగ్నీషియం వంటి ఖనిజాలు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బాదంపప్పులో ఉన్న ఫైబర్, మాగ్నీషియం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. బాదంపప్పులో ఉన్న ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఆకలి నియంత్రణలో సహాయపడతాయి. తద్వారా బరువు తగ్గించడంలో సహాయపడతాయి. బాదంపప్పులో ఉన్న విటమిన్ E చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో, వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

అయితే, బాధంపప్పు తినేటప్పుడు ఈ ఆహారాలు తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే అవి మీ ఆరోగ్యానికి లేదా బిడ్డకు హానికరంగా ఉండవచ్చు. ఇవి ముఖ్యంగా అలెర్జీలు, గ్యాస్, లేదా ఇతర జీర్ణ సమస్యలను కలిగించవచ్చు. కాబట్టి, బాదంపప్పుతో తినకూడని ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బాదంపప్పుతో తినకూడని ఆహారాలు:

* బాదంతో బెల్లం తీసుకోవడం వల్ల గ్యాస్, మలబద్ధకాలు వంటి జీర్ణ సమస్యలు కలగవచ్చు.

* బాదంపప్పుతో మసాలా పదార్థాలు కలిపి తింటే జీర్ణ సమస్యలు, అలెర్జీలు వచ్చే అవకాశం ఉంది.

* పాలు లేదా పాలు ఉత్పత్తులు బాదంపప్పుతో కలిపి తింటే కొన్ని సందర్భాల్లో అలెర్జీలు లేదా జీర్ణ సమస్యలు కలగవచ్చు.

* బాదంపప్పుతో మాంసాహారం కలిపఇ తింటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

* బాదంపప్పుతో తీపి పదార్థాలు కలిపి తింటే గ్యాస్, మలబద్ధకాలు వంటి సమస్యలు కలగవచ్చు.

* ఆల్కహాల్, స్నాక్స్, కారంగా, వేయించిన ఆహారాలు బాదంతో తినడం మంచిది కాదు.

Show Full Article
Print Article
Next Story
More Stories