Obesity: కూర్చొని ఉండడం వల్ల బరువు పెరుగుతున్నారా? 30-30-30 నియమం పాటించండి..!

Obesity
x

Obesity: కూర్చొని ఉండడం వల్ల బరువు పెరుగుతున్నారా? 30-30-30 నియమం పాటించండి..!

Highlights

Obesity: నేటి బిజీ జీవితంలో చాలా మంది ఎక్కువ సమయం కుర్చీలపై కూర్చొని గడుపుతున్నారు. ఎక్కువ గంటలు అలానే కూర్చోని పనిచేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

Obesity: నేటి బిజీ జీవితంలో చాలా మంది ఎక్కువ సమయం కుర్చీలపై కూర్చొని గడుపుతున్నారు. ఎక్కువ గంటలు అలానే కూర్చోని పనిచేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వెన్ను, మెడ నొప్పులు మాత్రమే కాకుండా బరువు కూడా పెరుగుతున్నారు. చాలామందికి జిమ్‌కు వెళ్ళేందుకు కూడా సమయం లేకపోవడం, డైట్ పద్ధతులు పాటించడం కష్టం కావడం వల్ల ఊబకాయం సమస్య మరింత పెరుగుతోంది. కూర్చుని పని చేయడం వల్ల బరువు పెరగడం, నడుము చుట్టూ కొవ్వు పెరగడం, అలసట, జీవక్రియ నెమ్మదిగా జరగడం వంటివి సాధారణ సమస్యలుగా మారాయి. అయితే, జిమ్‌కు వెళ్లకుండానే లేదా భారీ వ్యాయామాలు చేయకుండానే బరువు తగ్గడానికి 30-30-30 నియమం సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

30-30-30 నియమం అంటే ఏమిటి?

ఈ నియమం ఫిట్‌నెస్ లో చాలా ప్రజాదరణ పొందింది. ఇది చాలా సులభం. జిమ్‌కు వెళ్లకుండానే, ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండానే బరువు తగ్గించడానికి చాలా సహాయపడుతుంది.

30 గ్రాములు ప్రోటీన్ తినండి:

ప్రతిరోజు ఉదయం అల్పాహారంలో 30 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. ఇది శరీరంలో జీవక్రియ సక్రమంగా ఉండేందుకు సహాయపడుతుంది. గుడ్లు, పాలు, వేరుశెనగ వెన్న, పెరుగు వంటి ఆహారాలు మంచి ప్రోటీన్ మూలాలు. ఉదయం వీటిని తీసుకుంటే ఊబకాయం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

30 నిమిషాలు వాకింగ్:

రోజుకు కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేయండి. జిమ్‌కు వెళ్లకపోయినా, మెట్లు ఎక్కడం, ఇంటి పనులు చేయడం, తేలికపాటి యోగా లేదా నడవడం మంచి వ్యాయామం అవుతుంది. ఇది శరీరాన్ని చురుకుగా ఉంచి కొవ్వు కరగడంలో సహాయపడుతుంది.

భోజనం తర్వాత 30 నిమిషాలు కూర్చోవద్దు:

భోజనం చేసిన వెంటనే కుర్చీలో కూర్చోవడం మంచిది కాదు. భోజనం తర్వాత 30 నిమిషాలు తేలికపాటి నడక చేయడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది.కొవ్వు శరీరంలో నిల్వ కాకుండా ఉంటుంది. వీటిని పాటించడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories