Health Warning : ఫ్రైడ్ రైస్ ఎందుకు మంచిది కాదు? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే

Health Warning : ఫ్రైడ్ రైస్ ఎందుకు మంచిది కాదు? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే
x

Health Warning : ఫ్రైడ్ రైస్ ఎందుకు మంచిది కాదు? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే

Highlights

ఈ రోజుల్లో బయట ఆహారం తినేవారి సంఖ్య బాగా పెరిగింది. కొంచెం తీరిక దొరికితే చాలు, స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వెళ్లి ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఆసక్తి చూపుతున్నారు.

Health Warning : ఈ రోజుల్లో బయట ఆహారం తినేవారి సంఖ్య బాగా పెరిగింది. కొంచెం తీరిక దొరికితే చాలు, స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వెళ్లి ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ముఖ్యంగా వారానికి రెండు లేదా మూడు సార్లు ఫ్రైడ్ రైస్ వంటి ఫాస్ట్‌ఫుడ్ తినడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్రైడ్ రైస్ ఎందుకు అంత మంచిది కాదు? దీని వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.

జీర్ణక్రియ సమస్యలు, గుండెకు హాని

ఫ్రైడ్ రైస్ ఆరోగ్యానికి మంచిది కాకపోవడానికి ప్రధాన కారణం, ఒకసారి వండిన అన్నాన్ని మళ్లీ వేడి చేసి వేయించడం. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీని కారణంగా కడుపులో మంట, అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి.

అదే విధంగా, ఫ్రైడ్ రైస్‌కు ఉపయోగించే నూనెను చాలాసార్లు మళ్లీ మళ్లీ వేడి చేస్తారు. మసాలాలు, నూనెను పదేపదే వేడి చేసినప్పుడు, అందులో ట్రాన్స్ కొవ్వులు ఏర్పడతాయి. ఈ ట్రాన్స్ కొవ్వులు గుండెకు చాలా హానికరం. తరచుగా ఫ్రైడ్ రైస్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగి, గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే గుండె సమస్యలు ఉన్నవారు బయటి ఆహారానికి దూరంగా ఉండటం మంచిది.

అధిక కేలరీలు, ఉప్పుతో వచ్చే ముప్పు

ఫ్రైడ్ రైస్‌లో వాడే సోయా సాస్, చిల్లీ సాస్, ఉప్పు, వెనిగర్ వంటి పదార్థాలన్నీ రక్తపోటు పెరిగే ప్రమాదాన్ని పెంచుతాయి. అంతేకాకుండా ఫ్రైడ్ రైస్‌లలో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల బరువు పెరగడం ఖాయం, అంతేకాకుండా స్థూలకాయం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇవే కాకుం ఈ రకమైన ఆహారాలను ఎక్కువ మోతాదులో తింటే తలనొప్పి, గుండెలో మంట, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories