Health Warning : అరటిపండు, బొప్పాయి కలిపి తినకూడదా? ఈ రెండు పండ్ల కాంబినేషన్ ఎందుకు ప్రమాదకరం?

Health Warning : అరటిపండు, బొప్పాయి కలిపి తినకూడదా? ఈ రెండు పండ్ల కాంబినేషన్ ఎందుకు ప్రమాదకరం?
x

Health Warning : అరటిపండు, బొప్పాయి కలిపి తినకూడదా? ఈ రెండు పండ్ల కాంబినేషన్ ఎందుకు ప్రమాదకరం?

Highlights

అరటిపండు, బొప్పాయి రెండూ ఆరోగ్యానికి చాలా మంచివి. పోషకాలతో నిండిన పండ్లే. ఆరోగ్య నిపుణులు కూడా వీటిని ఎక్కువగా తినమని సిఫార్సు చేస్తారు.

Health Warning : అరటిపండు, బొప్పాయి రెండూ ఆరోగ్యానికి చాలా మంచివి. పోషకాలతో నిండిన పండ్లే. ఆరోగ్య నిపుణులు కూడా వీటిని ఎక్కువగా తినమని సిఫార్సు చేస్తారు. అయితే, కొన్ని పండ్లను కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అరటిపండు, బొప్పాయి విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఈ రెండు పండ్లనూ ఒకేసారి తినడం వల్ల వాంతులు, అలర్జీలు, అజీర్ణం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆయుర్వేదం చెబుతోంది. మరి ఆహార నిపుణులు, ఆయుర్వేద వైద్యులు అరటిపండు, బొప్పాయిని కలిపి తినకూడదు అని చెప్పడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం.

అరటిపండు, బొప్పాయి రెండూ తమతమ లక్షణాల ద్వారా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అరటిపండులో శరీరానికి అవసరమైన పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాలను బలంగా ఉంచడానికి, శరీరానికి శక్తిని అందించడానికి సహాయపడతాయి. బొప్పాయిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వివిధ లక్షణాలు కలిగిన పండ్లను ఒకేసారి తినడం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అరటిపండు, బొప్పాయి విభిన్న గుణాలను కలిగి ఉన్న పండ్లు. ఆయుర్వేదం ప్రకారం అరటిపండు శరీరాన్ని చల్లబరుస్తుంది. అయితే బొప్పాయి శరీరాన్ని వేడి చేస్తుంది. ఈ రెండు విరుద్ధ లక్షణాలు కలిగిన పండ్లను కలిపి తింటే జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ పండ్ల కలయిక కొందరిలో కడుపు ఉబ్బరం, ఇతర శ్వాసకోశ సమస్యలు కలిగించవచ్చు. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు బొప్పాయిని పూర్తిగా నివారించాలని నిపుణులు సూచిస్తారు.

ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం, విరుద్ధ స్వభావాలు కలిగిన ఆహారాలను కలిపి తినడం వల్ల జీర్ణ వ్యవస్థ బలహీనపడుతుంది. అరటిపండు, బొప్పాయిని ఒకేసారి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ బలహీనపడి, తలనొప్పి, వాంతులు, తల తిరగడం, అలర్జీలు, తీవ్రమైన అజీర్ణం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఈ సమస్యలను నివారించడానికి, ఈ పండ్లను వేర్వేరు సమయాల్లో తీసుకోవడం ఉత్తమం. అరటిపండు లేదా బొప్పాయిని విడిగా తినడం వల్ల వాటి పూర్తి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. సమస్యలు పెరగకుండా నిరోధించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories