Health Weakness: ఏ పని చేసినా అలసిపోతున్నారా? అయితే దానికి ఇదే కారణం?

Health Weakness
x

Health Weakness: ఏ పని చేసినా అలసిపోతున్నారా? అయితే దానికి ఇదే కారణం?

Highlights

Health Weakness: అలసట అనేది ఒక సాధారణమైన లక్షణమే. కానీ ప్రతి చిన్న పనికీ అలసట వస్తుందో ఆలోచించాల్సిందే. ఎందుకంటే అది శరీరంలో ఏదైనా ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు.

Health Weakness: అలసట అనేది ఒక సాధారణమైన లక్షణమే. కానీ ప్రతి చిన్న పనికీ అలసట వస్తుందో ఆలోచించాల్సిందే. ఎందుకంటే అది శరీరంలో ఏదైనా ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. అయితే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే ఈ అలసట నుండి దూరం కావచ్చు.

అలసట అనేది మానసికమైన అలాగే శారీరకమైన ఆరోగ్య సమస్య. ఒక్కోసారి రెండూ ఒకేసారి సంభవిస్తాయి. అలాంటి సమయంలో తీవ్రమైన అలసటకు లోనవుతారు. అలాంటప్పుడే ఏ చిన్న పనిచేసినా వెంటనే నీరసం అయిపోతారు. తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. అయితే దీని నుండి బయటపడాలంటే శారీరకమైన సమస్యగానీ, మానసిక మైన సమస్యగానీ ఏమున్నాయి అని ఎవరికి వాళ్లు తెలుసుకుంటే దాని నుండి బయటపడే ఛాన్స్ ఉంటుంది. మానసికమైన సమస్య ఉంటే దాని నుండి బయటపడే దారులు వెతుక్కోవాలి. అదేవిధంగా ఆరోగ్య పరమైన సమస్య్ ఉంటే వెంటనే డాక్టర్‌‌ని కలిసి వైద్యం చేయించుకోవాలి.

దీంతో పాటు శరీరానికి కావాల్సినంత పొటాషియం చాలా అవసరం. శరీరంలో పొటాషియం తక్కువైతే తీవ్రమైన అలసటతో పాటు కండరాల బలహీనత, మలబద్దకం, గుండెదడ, అరిథ్మియా వంటి సమస్యలు తలెత్తుతాయి. ఒక్కోసారి పొటాషియం లోపం తీవ్రంగా ఉంటే హార్డ్ ఎటాక్‌లు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే పొటాషియం ఉండే ఆహార పదార్ధాలను తీసుకోవాలి.

పొటాషియం ఉండే ఆహారపదార్దాలు:

టమాటాలు, నట్స్, అరటి పండ్లు, యాప్రికాట్స్, చేపలు, తృణ ధాన్యాలు, పెరుగు, పాలు, చిలగడ దుంపలు, కోడిగుడ్లు, బీట్ రూట్, కివి, కొబ్బరి నీళ్లు, నారింజ, క్యారెట్, తర్బూజా, మాంసం వంటి ఆహార పదార్ధాల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని తరచూ తీసుకోవాలి.

ఎంతతిన్నా శరీరం ఇంకా అలసటగా ఉంది అంటే వెంటనే డాక్టర్‌‌ని సంప్రదించాలి. లేదంటే సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది. అలసటను తక్కువ అంచనా వేయకుండా చికిత్స తీసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories