Healthy Breakfast: చిటికెలో రెడీ అయ్యే 7 బెస్ట్ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్స్ ఇవే!

Healthy Breakfast
x

Healthy Breakfast: చిటికెలో రెడీ అయ్యే 7 బెస్ట్ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్స్ ఇవే!

Highlights

Healthy Breakfast: చిటికెలో తయారుచేసుకునే హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ ఐడియాలు

Healthy Breakfast: ఉదయాన్నే ఆఫీస్, స్కూల్ లేదా ఇతర పనుల కోసం తొందరగా బయలుదేరే వారిలో చాలామంది బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి మేలుకాదు. అలవాటుగా బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే బరువు పెరగడం, అలసట వంటి సమస్యలు తలెత్తవచ్చు. అందుకే చిటికెలో తయారుచేసుకునే హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ ఐడియాలు ఇక్కడ చూద్దాం.


నాన్ కుకింగ్ బ్రేక్ ఫాస్ట్స్

మార్నింగ్ బిజీ షెడ్యూల్ ఉండేవాళ్లు బ్రేక్ ఫాస్ట్ చేసుకునే తీరిక లేనివాళ్లు బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడం చల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. అందుకే చిటికెలో రెడీ చేయగలిగే బెస్ట్ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ ఐడియాలు ఇప్పుడు చూద్దాం.


ఫ్రూట్ సలాడ్

ద్రాక్ష, ఖర్జూరం, స్ట్రాబెరీ వంటి పండ్లతో పాటు కీరా, బొప్పాయి, యాపిల్ వంటి పండ్లను కట్ చేసి వాటిపైన కొద్దిగా తేనె, నిమ్మరసం కలుపుకుంటే హెల్దీ బ్రేక్ ఫాస్ట్ రెడీ. దీన్ని చేయడానికి పది నిముషాలు కూడా పట్టదు.


బనానా షేక్

రెండు అరటి పండ్లను మిక్సీ జార్‌‌లో వేసి అందులో గ్లాసు పాలు, కొన్ని జీడిపప్పులు, కొద్దిగా తెనే వేసి ఐదు నిముషాల పాటి గ్రైండ్ చేస్తే.. హెల్దీ బనానా ప్రొటీన్ షేక్ రెడీ అవుతుంది. ఇదొక మంచి బ్రేక్ ఫాస్ట్ ఐడియా.


ఓట్స్ థఢ్‌కా..

రాత్రి పడుకునే ముందు ఓట్స్‌ను పెరుగులో నానబెట్టి ఉదయాన్నే అందులో కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్‌, ఉప్పు, పెప్పర్ పొడి వేసి కలుపుకుంటే ఓట్స్ థడ్‌కా రెడీ.


చియా సీడ్స్ పుడింగ్

రాత్రి పడుకునేముందు పాలు లేదా పెరుగులో చియా సీడ్స్ నానబెట్టి ఉదయాన్నే అందులో డ్రై ఫ్రూట్స్, నట్స్, కొద్దిగా తేనె కలుపుకుంటే చియా సీడ్స్ పుడింగ్ రెడీ.


డ్రై ఫ్రూట్స్ బౌల్

రాత్రి పడుకునే ముందు జీడిపప్పులు, బాదం, పిస్తా, వాల్ నట్స్, వేరు శెనగలు, గుమ్మడి గింజలు, సన్ ఫ్లవర్ సీడ్స్, అంజీర్, డ్రై క్రిస్మిస్ వంటివి నానబెట్టుకుని ఉదయాన్నే తింటే మంచి హెల్దీ ప్రొటీన్ బ్రేక్‌ఫాస్ట్ తిన్నట్టే.


బ్రెడ్ అండ్ జామ్

చిటికెలో రెడీ చేసుకోగల బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్స్‌లో బ్రెడ్డు జామ్ కూడా ఒకటి. అయితే దీనికోసం హెల్దీ బ్రౌన్ బ్రెడ్ అలాగే ఆర్గానిక్ ఫ్రూట్ జామ్స్ వంటివి వాడితే మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories