Immunity Booster Laddu: ఈ లడ్డు తింటే ఇమ్యూనిటీ సూపర్.. కరోనా పరార్

Immunity Booster Laddu: ఈ లడ్డు తింటే ఇమ్యూనిటీ సూపర్.. కరోనా పరార్
x

అవిశెగింజలు, బెల్లం, గుమ్మడి గింజలు, పల్లీలతో చేసిన లడ్డులు (ఫైల్ ఇమేజ్)

Highlights

Immunity Booster Laddu: మన ఇంట్లో వుండే పదార్థాలతో ఇమ్యూనిటీని పెంచుకుని కరోనాకు చెక్ పెట్టవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

Immunity Booster Laddu: కరోనా... కరోనా ఈ పేరు వింటేనే హడలి పోతున్నారు. కారణం ఆ మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. మొదటి దశ వణికిస్తే, రెండో దశ మాత్రం తన ప్రతాపాన్ని చూపింది. మరో వైపు మూడో దశ పిల్లలపై ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు అనేక మంది వైద్య నిఫుణులు హెచ్చరిస్తున్నారు. అస్సలు కరోనాను ఎదుర్కోవాలంటే ఇంత వరకు సరైన మందు మాత్రం కనిపెట్టలేదు. కరోనా ను అరికట్టేందుకు ఒక లడ్డు అద్భుతంగా పనిచేస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. లడ్డు అంటే సున్నుండలో, బూందీ లడ్డో అనుకుంటున్నారా కాదు కాదు. మరి ఏంటి ఆ లడ్డు, వేటితో దాన్ని తయారు చేస్తారో మన 'లైఫ్ స్టైల్' లో తెలుసుకుందాం.

నువ్వులు, ఆక్రూట్, పల్లీలు, అవిశగింజలు, యాలుకలు, బెల్లం, గుమ్మడిగింజలు, సన్ ఫ్లవర్ సీడ్స్ వీటన్నిటిని కలిపి లడ్డూ తయారు చేసుకుని రోజుకు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి తీసుకుంటే కరోనా మన దరికి రాదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. వీటన్నింటి సమపాళ్లలో తీసుకుని ఒకొక్కటిగా దోరగా వేయించుకుని తగినంత బెల్లాని కలిపి పొడి చేసి ఉండలుగా చుట్టుకోవాలి. అంటే కరోనాకు చెక్ పెట్టే లడ్డూ తయారైనట్లే. ప్రత్యేకంగా రాబోవు కాలంలో పిల్లలు కరోనా మహమ్మారి బారిన పడే అవకాశలు ఎక్కవుని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి నుండే ఈరోజూ పిల్లలు, పెద్దలు తప్పని సరిగా ఈ లడ్డూలను తీసుకుంటే ఆ మహమ్మారి బారి నుండి తప్పించుకోవచ్చు. ఇమ్యూనిటీని పెంచుతుంది.

నువ్వులు: నువ్వులు వుండే లిగ్నిన్స్ అనే ఫైబర్స్ శరీరాల్లో ఏర్పడే చెడు కొవ్వును పూర్తిగా తొలగిస్తుంది. కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఒమేగా-3, ఒమేగా-6, ఒమేగా-9 ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ ఉదయం, సాయంత్రం ఒక స్ఫూన్ చొప్పున తీసుకుంటూ వుంటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఎలాంటి రోగాలను ధరిచేయనికుండా చేస్తుంది.

ఆక్రూట్: వాల్ నట్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు శరీరంలో మెటబాలిక్ రేటును క్రమంగా పెంచుతుంది మరియు ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. ముఖ్యంగా ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులను తగ్గిస్తుంది మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో శరీర బరువును కంట్రోల్ చేస్తుంది.

పల్లీలు: పల్లీల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మాంగనీస్ హార్ట్ ఎటాక్ రాకుండా చూస్తాయి. అంతేకాదు శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఇందులో ఎక్కువగా మెగ్నీషియం, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి. వీటిని అలాగే పచ్చివి. లేదా వేయించినవి. లేదా ఉప్పుపట్టిం చినవి తినవచ్చు. రోజుకో గుప్పెడు పల్లీలు తినండి.. ఆరోగ్యంగా ఉండండి.. అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

అవిశగింజలు: అవిశగింజల్లో వుండే 'ఒమెగా 3' ఫ్యాటీ యాసిడ్లు గుండె స‌మ‌స్య‌ల‌ను రాకుండా చూస్తాయి. శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ లేకుండా చేస్తాయి. బి,పి, షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసే గుణం వుంది.

గుమ్మడిగింజలు: గుమ్మడి గింజల్లో ఉండే ఫైటోస్టెరాల్ నిల్వలు కొవ్వు నిల్వలను పోలి ఉంటాయి. ఈ కారణంగా గుమ్మడి గింజలను ఆహారంగా తీసుకున్న వారిలో అవి జీర్ణమైన తర్వాత పేగులు ఈ ఫైటోస్టెరాల్ నిల్వలను కూడా గ్రహిస్తాయి.

వీటన్నింటిని శరీరంలోకి వెళితే ఎలాంటి వైరస్ నైనా తట్టుకునే శక్తి మనకు లభిస్తుంది. కనుక వెంటనే ఈ లడ్డూలను తయారు చేసుకుని తినేస్తే సరి.

Show Full Article
Print Article
Next Story
More Stories