Ginger: ఎండవేళ అల్లం రసం ముఖానికి ఇలా రాస్తే చంద్రబింబంలా మెరిసిపోతుంది…

Ginger
x

Ginger: ఎండవేళ అల్లం రసం ముఖానికి ఇలా రాస్తే చంద్రబింబంలా మెరిసిపోతుంది…

Highlights

Ginger for Glowing Skin: మన భారతీయ వంటగదిలో అల్లం వెల్లుల్లి తప్పనిసరిగా ఉంటుంది. అల్లంలో యాంటీ బయోటిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.

Ginger for Glowing Skin: ఆయుర్వేద పరంగా కూడా అల్లం ఉపయోగిస్తారు. వంటల్లో తప్పకుండా అల్లం లేనిదే తినలేని పరిస్థితి ఉంటుంది. అయితే వంటల్లో మాత్రమే కాదు ఆరోగ్యపరంగా కూడా ఇది మంచిది. దగ్గు, రొంప సమస్యలు తగ్గిస్తుంది. అయితే, సౌందర్య పరంగా కూడా అల్లం ఎన్నో ఉపయోగాలు కలిగి ఉంది .

అల్లంలోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఉంటాయి. ఇందులో యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు మన శరీరాన్ని మెరుపు అందిస్తుంది. ప్రధానంగా ఎండవేళ ముఖం జుట్టు మారిపోతుంది. ఆ సమయంలో అల్లం రసం ఉపయోగించాలి. ముఖం ఉండే డెడ్‌ సెల్‌ స్కిన్‌ తొలగించి చర్మాని రక్షిస్తుంది. దీంతో మీ చర్మం యవ్వనంగా ఆరోగ్యంగా కనిపిస్తుంది ముఖ ఛాయ కూడా మెరుగవుతుంది. అల్లం వల్ల చర్మం రక్త సరఫరాను కూడా మెరుగవుతుంది. ఇందులో డీటాక్సివేషన్ గుణాలు కలిగి ఉంటాయి.

అల్లం రసం ముఖానికి అప్లై చేయడం వల్ల చెమట వల్ల పేరుకున్న దుమ్మూ ధూళీ తొలగిపోతుంది. అంతే కాదు డెడ్‌సెల్స్‌ కూడా తొలగిపోతాయి. అల్లంతో ఫేస్ మాస్క్‌ వేసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ల బారి నుంచి కూడా బయటపడతారు. ముఖంపై ఉండే దురదలు తగ్గిపోతాయి .

అల్లం రెగ్యులర్‌గా మనం ప్యాక్‌ మాదిరి అప్లై చేయడం వల్ల చర్మ టోన్ కూడా మెరుగు పడుతుంది. రక్త ప్రసరణ మెరుగవుతుంది. అల్లం రసం తేనెతో కలిపి తీసుకోవడం వల్ల చర్మం తాజాదనంగా మారిపోతుంది. వేసవికాలంలో అల్లం ముఖానికి అప్లై చేయడం వల్ల స్కిన్ తాజాదనంతో రోజంతా ఉంటుంది.

కలబంద, అల్లం రసం కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకొని అరగంట తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. దీంతో ముఖంపై ట్యాన్ తగ్గిపోతుంది. అల్లం రసం రోజ్ వాటర్ రెండు కలిపి ముఖానికి అప్లై చేసి ఆరిన తర్వాత ఫేస్ ప్యాక్ చేసుకోండి. అంతేకాదు అల్లం డిటాక్స్ డ్రింక్ లో పనిచేస్తుంది. ఉదయం పరగడుపున అల్లం రసం నీటిలో కలిపి తీసుకోవటం వల్ల ముఖానికి మంచి గ్లో వస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories