Sleep Deprivation : నిద్ర లేకుండా ఎన్ని రోజులు బతకగలం? గిన్నిస్ రికార్డు సృష్టించిన వ్యక్తికి ఏం జరిగింది?

Sleep Deprivation
x

Sleep Deprivation : నిద్ర లేకుండా ఎన్ని రోజులు బతకగలం? గిన్నిస్ రికార్డు సృష్టించిన వ్యక్తికి ఏం జరిగింది?

Highlights

Sleep Deprivation : నిద్ర అనేది మనిషి శరీరానికి, మనసుకు అత్యంత ముఖ్యమైన అవసరం. ఒక రోజు సరిగా నిద్ర లేకపోతేనే చిరాకు, కోపం మొదలవుతాయి.

Sleep Deprivation : నిద్ర అనేది మనిషి శరీరానికి, మనసుకు అత్యంత ముఖ్యమైన అవసరం. ఒక రోజు సరిగా నిద్ర లేకపోతేనే చిరాకు, కోపం మొదలవుతాయి. అదే ఎక్కువ రోజులు నిద్ర లేకపోతే ఏమవుతుంది? ఒక మనిషి నిద్ర లేకుండా ఎన్ని రోజులు బ్రతకగలడు? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం లేకపోయినా, ఈ విషయంపై చాలా పరిశోధనలు జరిగాయి. నిద్ర లేకపోవడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో, అలాగే నిద్ర సరిగా పట్టడానికి కొన్ని చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిద్ర లేకుండా ఎన్ని రోజులు మేల్కొని ఉండవచ్చు?

నిద్ర లేకుండా ఒక వ్యక్తి ఎంత కాలం జీవించగలడు అనేదానికి ఖచ్చితమైన పరిమితి ఇప్పటివరకు ఎవరూ నిర్ధారించలేదు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. అత్యధిక కాలం నిద్రపోకుండా మేల్కొని ఉన్న రికార్డు రాబర్ట్ మెక్‌డొనాల్డ్ పేరు మీద ఉంది. ఆయన ఏకంగా 18 రోజులు, 21 గంటల 40 నిమిషాల పాటు నిద్రపోకుండా మేల్కొని ఉన్నారు.ఈ ప్రయత్నం వల్ల ఆయన ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాలు కలగడంతో, ఇలాంటి ప్రమాదకర రికార్డులను ప్రోత్సహించకూడదని భావించి, 1997లో గిన్నిస్ ఈ రికార్డు విభాగాన్ని పూర్తిగా నిలిపివేసింది.

స్వల్పకాలికంగా నిద్ర మానేస్తే వచ్చే సమస్యలు

సాధారణంగా మీరు 24 గంటలు నిద్రపోకుండా మేల్కొని ఉంటే తరచుగా ఆవలింతలు రావడం, కొద్దిపాటి అలసట మొదలవుతుంది. నిద్ర 24 గంటలు దాటితే మెదడు పనితీరు మందగిస్తుంది. ఏకాగ్రత బలహీనపడుతుంది. తీవ్రమైన కోపం, చిరాకు, మనస్తత్వంలో మార్పులు వస్తాయి. శరీర శక్తి బలహీనపడి, రోగనిరోధక శక్తి కూడా క్షీణిస్తుంది.

దీర్ఘకాలికంగా నిద్ర లేమి వలన కలిగే ప్రమాదాలు

నిరంతరం నిద్ర లేమితో బాధపడేవారికి అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం లేదా అనవసరంగా బరువు పెరగడం, శారీరక సమతుల్యత కోల్పోవడం, లైంగిక సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు.

మంచి నిద్ర పొందడానికి చిట్కాలు

మంచి ఆరోగ్యం కోసం, ప్రతిరోజూ నాణ్యమైన నిద్ర చాలా అవసరం. అందుకు ఈ చిట్కాలు పాటించండి.

* సమయపాలన: ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, మేల్కోవడం అలవాటు చేసుకోండి.

* బెడ్‌రూమ్ సెట్టింగ్: మీ పడుకునే గది ప్రశాంతంగా, చీకటిగా, సౌకర్యవంతంగా, సరైన ఉష్ణోగ్రతలో ఉండేలా చూసుకోండి.

* ఎలక్ట్రానిక్స్ దూరం: టీవీలు, కంప్యూటర్లు, ముఖ్యంగా మొబైల్ ఫోన్లను పడుకునే గదికి దూరంగా ఉంచండి.

* ఆహారం/పానీయాలు: నిద్రపోయే ముందు భారీ భోజనం, కాఫీ (కెఫీన్), మద్యం, పొగాకు వాడకాన్ని పూర్తిగా మానుకోండి.

* వ్యాయామం: ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రాత్రి మంచి నిద్ర పడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories