Raw Chicken: ఫ్రిజ్‌లో స్టోర్ చేసే చికెన్ నిజంగా సేఫ్‌నా? ఎంతకాలం?

ఫ్రిజ్‌లో స్టోర్ చేసే చికెన్ నిజంగా సేఫ్‌నా? ఎంతకాలం?
x

ఫ్రిజ్‌లో స్టోర్ చేసే చికెన్ నిజంగా సేఫ్‌నా? ఎంతకాలం?

Highlights

చికెన్‌ను ఫ్రిజ్‌లో పెట్టడం చాలా మంది రోజూ చేసే పని. కానీ పచ్చి చికెన్‌ను ఎంతకాలం నిల్వ చేయొచ్చు? దాని గురించి చాలా మందికి పూర్తిగా అవగాహన ఉండదు.

చికెన్‌ను ఫ్రిజ్‌లో పెట్టడం చాలా మంది రోజూ చేసే పని. కానీ పచ్చి చికెన్‌ను ఎంతకాలం నిల్వ చేయొచ్చు? దాని గురించి చాలా మందికి పూర్తిగా అవగాహన ఉండదు. చికెన్‌ను తప్పుగా స్టోర్ చేస్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వండిన చికెన్ కాదు… పచ్చి చికెన్‌ను ఎన్ని రోజులు ఫ్రిజ్‌లో సురక్షితంగా ఉంచుకోవచ్చో తప్పక తెలుసుకోవాలి.

ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ ఫ్రిజ్ అనేది అవసరమైన వస్తువే. ఎక్కువ చల్లదనం వల్ల ఆహారం త్వరగా పాడవకుండా ఉండిపోతుందని అనుకుని కొందరు పచ్చి చికెన్‌ను కూడా రోజులు రోజులు నిల్వ చేస్తుంటారు. కానీ ఫ్రిజ్‌లో కూడా బాక్టీరియా పెరుగుతూ ఉంటుందని చాలా మందికి తెలియదు. రిఫ్రిజిరేషన్ వల్ల బాక్టీరియా పెరుగుదల కేవలం నెమ్మదిస్తుంది కానీ పూర్తిగా ఆపదు. ముఖ్యంగా ఫ్రిజ్‌ను తరచూ ఓపెన్ చేయడం, లోపలి టెంపరేచర్ 4°C కంటే ఎక్కువగా పెరగడం వంటి కారణాలతో చికెన్ త్వరగా చెడిపోవచ్చు.

నిపుణుల సూచన ప్రకారం పచ్చి చికెన్‌ను ఫ్రిజ్‌లో గరిష్టంగా 2-3 రోజులు మాత్రమే నిల్వ చేయాలి. 48 గంటల్లోపే వండడం మంచిది. అంతకంటే ఎక్కువ రోజుల పాటు స్టోర్ చేయాలనుకుంటే డీప్ ఫ్రిజర్‌లో పెట్టాలి. పూర్తిగా గడ్డకట్టేలా ఉంచితే చికెన్ ఎక్కువకాలం పాడవకుండా ఉంటుంది.

చికెన్‌ను ఫ్రిజ్‌లో ఉంచేటప్పుడు గాలి చొరబడని కంటైనర్‌లో లేదా గట్టిగా మూసిన కవర్‌లో స్టోర్ చేయాలి. లూజ్‌గా పెట్టితే ఇతర ఆహారాలకు బ్యాక్టీరియా సోకే ప్రమాదం ఉంటుంది. ఇంకా చాలామంది వండే ముందు చికెన్‌ను కడుగుతారు. కానీ నీటి చినుకుల ద్వారా సింక్, స్టవ్, కౌంటర్‌టాప్‌లకు బ్యాక్టీరియా వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల చికెన్‌ను కడగకుండా నేరుగా వండడం సురక్షితం. ముఖ్యంగా వేసవిలో చికెన్ వేగంగా చెడిపోతుంది కాబట్టి ఇంకాస్త జాగ్రత్త అవసరం.

మొత్తం మీద — పచ్చి చికెన్‌ను ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు ఉంచి రిస్క్ తీసుకోవద్దు! సరైన విధంగా స్టోర్ చేసి, త్వరగా వండి తినడం ఆరోగ్యానికే మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories