How to Get Rid of Ants: ఇంట్లో చీమలు చిరాకు తెప్పిస్తున్నాయా.. ఇలా చేస్తే దెబ్బకు పరార్

How to Get Rid of Ants
x

How to Get Rid of Ants: ఇంట్లో చీమలు చిరాకు తెప్పిస్తున్నాయా.. ఇలా చేస్తే దెబ్బకు పరార్

Highlights

How to Get Rid of Ants: వేసవిలో చీమల సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం అధిక ఉష్ణోగ్రత. వేసవిలో ఉష్ణోగ్రత పెరగడం వల్ల చీమలు బయటకు వచ్చి ఆహారం కోసం వెతుకుతాయి.

How to Get Rid of Ants: వేసవిలో చీమల సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం అధిక ఉష్ణోగ్రత. వేసవిలో ఉష్ణోగ్రత పెరగడం వల్ల చీమలు బయటకు వచ్చి ఆహారం కోసం వెతుకుతాయి. ఎందుకంటే, వేడి వాతావరణం చీమలు మరింత చురుగ్గా ఉండటానికి దోహదపడుతుంది. అయితే, ఇంట్లోకి చీమలు గుంపులు గుంపులుగా వచ్చి చాలా చిరాకు తెప్పిస్తాయి. వాటిని వదిలించుకోవడం చాలా కష్టం. మీరు కూడా మీ ఇంట్లోకి చీమల సమస్యతో ఇబ్బంది పడుతుంటే, కొన్ని సులభమైన ఇంటి నివారణల ద్వారా వాటిని వదిలించుకోవచ్చు. ఆ ఇంటి నివారణలు ఏంటో తెలుసుకుందాం..

వెనిగర్, వాటర్ స్ప్రే:

ఒక గిన్నెలో సమాన పరిమాణంలో తెల్ల వెనిగర్, నీటిని కలపండి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో నింపండి. ఇంట్లో మూలాలు, చీమలు తిరిగే ప్లేసెస్‌లో దానిని స్ప్రే చేయండి. వెనిగర్ వాసనకు చీమలు పారిపోతాయి.

నిమ్మరసం లేదా తొక్క:

నిమ్మకాయ వాసన అంటే చీమలకు పడదు. కాబట్టి, అవి ఇంటిని వదిలివెళ్లిపోతాయి. మీరు ఇల్లు శుభ్రం చేసేటప్పుడు నిమ్మరసాన్ని నీటిలో కలపండి. లేదా చీమలు తిరిగే ప్లేసులో నిమ్మకాయ తొక్క ఉంచండి. దెబ్బకు పారిపోతాయి.

దాల్చిన చెక్క పొడి

చీమలు ఎక్కడ కనిపించినా, అక్కడ దాల్చిన చెక్క పొడి చల్లండి దీని వాసన చీమలు సంచరించకుండా నిరోధిస్తాయి.

బోరిక్ పౌడర్,చక్కెర మిశ్రమం

కొంచెం చక్కెరను బోరిక్ పౌడర్ తో కలిపి చీమలు తిరిగే మార్గంలో ఉంచండి. చీమలు ఈ మిశ్రమాన్ని తీసుకొని తిని నెమ్మదిగా నశించిపోతాయి. అయితే, ఇంట్లో పెంపుడు జంతువులు లేదా చిన్న పిల్లలు ఉంటే ఈ మిశరమాన్ని వాడటం మంచిది కాదు.

పుదీనా

పుదీనాను నీటిలో మరిగించండి.తర్వాత ఈ నీటిని స్ప్రే బాటిల్‌లో నింపి చీమలు వచ్చిన చోట చల్లండి. ఇది చీమలను తరిమికొట్టడంలో ప్రభావవంతంగా ఉంటుంది.

ఉప్పు లేదా పసుపు చల్లండి

ఇంట్లో గోడలు, కిటికీలు లేదా తలుపులపై, పగుళ్ల దగ్గర ఉప్పు లేదా పసుపు చల్లితే చీమలు రావు.

Show Full Article
Print Article
Next Story
More Stories