Heart Health Tips: గుండె ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి!

Heart Health Tips
x

Heart Health Tips: గుండె ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి!

Highlights

Heart Health Tips: ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా గుండె సంబంధిత వ్యాధులు చిన్న వయసులోనే చుట్టుముడుతున్నాయి.

Heart Health Tips: ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా గుండె సంబంధిత వ్యాధులు చిన్న వయసులోనే చుట్టుముడుతున్నాయి. మనం తీసుకునే అనారోగ్యకరమైన ఆహారం వల్ల గుండె ధమనులలో కొవ్వు (Plaque) పేరుకుపోయి రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని ఫలితంగా అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు, గుండెపోటు ప్రమాదం పెరుగుతుందని వెల్లడించారు.

మీ గుండె ప్రమాదంలో ఉందని శరీరం ఈ క్రింది రూపంలో హెచ్చరిస్తుందని వైద్య నిపుణులు సూచించారు.

* చిన్న పని చేసినా విపరీతంగా అలసిపోవడం.

* ఛాతీపై ఏదో భారం పెట్టినట్లు అనిపించడం.

* మెట్లు ఎక్కినా లేదా నడిచినా ఆయాసం రావడం.

* శరీర బరువు అకస్మాత్తుగా పెరగడం.

* కడుపులో మంట లేదా గ్యాస్ సమస్యలు తరచుగా వేధించడం.

పలువురు నిపుణులు అభిప్రాయం ప్రకారం.. నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎందుకంటే ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయని వెల్లడించారు. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు కూడా దూరంగా ఉండాలని చెప్పారు. ప్యాక్ చేసిన ఆహారాల్లో ఉప్పు, ప్రిజర్వేటివ్స్, నాణ్యత లేని కొవ్వులు అధికంగా ఉంటాయని చెప్పారు.స్వీట్లు, కూల్ డ్రింక్స్ వల్ల బరువు పెరగడంతో పాటు షుగర్ వచ్చే అవకాశం ఉందని వివరించారు. అధిక కొవ్వు ఉన్న మాంసం రక్త నాళాలను కుదింపజేస్తుందని చెప్పారు.

ఆరోగ్యకరమైన గుండె కోసం ఏం తినాలంటే..

మీ గుండెను పదికాలాల పాటు పదిలంగా ఉంచుకోవడానికి మీ డైట్‌లో వీటిని చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

* ఆకుకూరలు & పండ్లు.. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ గుండెకు రక్షణనిస్తాయి.

* తృణధాన్యాలు.. వీటిలో పీచు పదార్థం (Fiber) అధికంగా ఉండే ఓట్స్, రాగులు, జొన్నలు గుండెకు మేలు చేస్తాయి.

* చేపలు, వాల్‌నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ (అవిసె గింజలు) గుండెను బలోపేతం చేస్తాయి.

* ఆహారంలో ఉప్పు, చక్కెర శాతాన్ని వీలైనంత తగ్గించాలి.

* ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల నడక లేదా వ్యాయామం తప్పనిసరి.

* మితిమీరిన ఆలోచనలు, ఆందోళన గుండెపై భారాన్ని పెంచుతాయి. యోగా లేదా ధ్యానం అలవాటు చేసుకోండి.

* రోజుకు 7-8 గంటల గాఢ నిద్ర గుండె ఆరోగ్యానికి అవసరం.

* స్మోకింగ్, మద్యం తాగడం వంటి అలవాట్లను మానుకోవాలి.

గుండె సమస్యలు ఒక్కరోజులో రావు. మనం రోజూ చేసే చిన్న చిన్న తప్పులే పెద్ద వ్యాధులుగా మారుతాయని వెల్లడించారు. ఇప్పటికైనా మేల్కొని ఆరోగ్యకరమైన ఆహారం, చురుకైన జీవనశైలిని అలవర్చుకుంటే గుండె జబ్బులను దరిచేరకుండా చూసుకోవచ్చని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories