Skincare: 40లో కూడా 20లా యవ్వనంగా కనిపించాలంటే ఈ ఒక్క చిట్కా ఫాలో అవ్వండి చాలు

Skincare
x

Skincare: 40లో కూడా 20లా యవ్వనంగా కనిపించాలంటే ఈ ఒక్క చిట్కా ఫాలో అవ్వండి చాలు

Highlights

Youthful Skin Tips: వయస్సు పెరుగుతున్నా కొద్దీ ముఖం కాస్త డల్‌గా మారిపోతుంది. నిర్జీవంగా కనిపిస్తుంది. అంతేకాదు స్కిన్‌పై వృద్ధాప్య ఛాయలు కూడా కనిపించడం ప్రారంభం అవుతాయి.

Youthful Skin Tips: మన వయస్సు పెరుగుతున్నా కొద్దీ ముఖంపై వృద్ధాప్య ఛాయలు కనిపించడం సహజం. అయితే చర్మం నిత్య యవ్వనంగా ఉంచుకోవడానికి అనేక స్కిన్ కేర్ రొటీన్స్ పాటిస్తాం. అంతేకాదు మన లైఫ్ స్టైల్ లో కూడా మార్పులు చేసుకోవాలి. దీంతో మీరు 40 లో కూడా 20ల యవ్వనంగా కనిపిస్తారు.దీనికి మీరు ఈ చిన్న చిట్కాను పాటిస్తే చాలు మీ డైలీ స్కిన్ కేర్ రొటీన్‌లో చేర్చుకుంటే నిత్య యవ్వనంగా మీ ముఖం వెలిగిపోతుంది.

ముఖం యవ్వనంగా కనిపించడానికి తగిన మోతాదులో నీళ్లు తీసుకోవాలి. దీంతో మన శరీరంలో ఉండే విష పదార్థాలు బయటికి పోతాయి. ముఖంపై ఉండే మచ్చలు, గీతలు కూడా తొలగిపోతాయి. మొత్తానికి మన శరీరం కడుపున శుభ్రం చేస్తుంది. నీరు మన చర్మానికి, జుట్టుకు హైడ్రేషన్ అందిస్తుంది నీరు.

ప్రతిరోజు ఒక స్కిన్ కేర్ రొటీన్ పాటించండి. దీనివల్ల మీ చర్మం అందంగా ..మెరుస్తూ ఉంటుంది. ప్రధానంగా మీ ముఖాన్ని షీల్డ్‌లా కాపాడే ఉత్పత్తులను వాడండి. సన్‌ డ్యామేజ్‌ కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. తద్వారా మీ ముఖం త్వరగా పొడిబారిపోయి ,వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. ప్రతిరోజు క్లెన్సింగ్, మాయిశ్చరైజింగ్, SPF ఉండే సన్‌స్క్రీన్‌ రాసుకోవడం అలవాటు చేసుకోండి.

అంతేకాదు మనం తీసుకునే డైట్ కూడా ఎంతో ముఖ్యం. మీరు గింజలు, ఆకుపచ్చ కూరగాయలు, బెర్రీ జాతికి చెందిన పండ్లు వంటివి చేర్చుకోవాలి. తద్వారా ముఖంపై కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ కాకుండా వ్యతిరేకంగా పోరాడుతుంది. మీ ముఖం యవ్వనంగా కనిపిస్తుంది.

దీంతో పాటు రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్‌ కూడా చేయాలి. తద్వారా మీ ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇది బ్లడ్ సర్క్యూలేషన్ మెరుగు చేస్తుంది. స్ట్రెస్ స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో మీ చర్మానికి సాగే గుణం అందుతుంది.

ఇక నిద్ర కూడా కచ్చితంగా ప్రతి నుంచి 7 నుంచి 9 గంటలు నిద్ర ఉండాలి. దీనివల్ల ముఖం మెరుస్తుంది. ముఖంపై ఉండే మచ్చలు, గీతాలు కూడా తగ్గిపోతాయి. ఇవి కాకుండా 40 కి చేరువలో ఉన్నవాళ్లు రెటినోల్‌, విటమిన్ సి హైలోరిక్‌ యాసిడ్ వంటి ఉత్పత్తులను వాడాలి. ఇవి చర్మంపై కోల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడి మంచి హైడ్రేషన్ అందించి ముఖంపై గీతాలు తొలగిస్తాయి.

ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. స్ట్రెస్ వల్ల త్వరగా ముఖంపై వృద్ధాప్యా ఛాయలు కనిపిస్తాయి. దీంతో మీ ముఖం డల్‌గా మారిపోతుంది. దీనికి మీరు యోగా, మెడిటేషన్, లోతైన శ్వాసకు సంబంధించిన ఎక్సర్‌సైజులు వంటివి చేయాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories