Monsoon Diet Tips: వర్షాకాలంలో ఈ పండ్లు తింటే..ఇన్ఫెక్షన్లకు గుడ్​బై చెప్పొచ్చు

If you eat these fruits during monsoon, you can stay away from infections
x

Monsoon Diet Tips: వర్షాకాలంలో ఈ పండ్లు తింటే..ఇన్ఫెక్షన్లకు గుడ్​బై చెప్పొచ్చు

Highlights

Monsoon Diet Tips: వర్షాకాలం షురూ అయ్యింది. వర్షాలతోపాటు అనేక అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ఈ క్రమంలో ఈ పండ్లు తింటే పలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

Monsoon Diet Tips:వర్షాకాలం..అనేక వ్యాధులు మోసుకొస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా..ఏదొక అనారోగ్య సమస్య వస్తూనే ఉంటుంది. జలుబు, దగ్గు మొదలు డెంగ్యూ జ్వరం, మలేరియా, సీజనల్ ఫీవర్, టైఫాయిడ్, వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు కూడా ఇబ్బంది పెడుతుంటాయి. ఈ క్రమంలోనే కొన్ని రకాల పండ్లు తీసుకుంటే ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ పండ్లు ఇన్ఫెక్షతో పోరాడటానికి, ఇమ్యూనిటీని పెంచడానికి సహాయపడతాయని చెబుతున్నారు. ఆ జాబితాలో ఎలాంటి పండ్లు ఉన్నాయో చూద్దాం.

బ్లూ బెర్రీలు:

వర్షాకాలంలో ఎదురయ్యే పలు అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకునేందుకు బ్లూబెర్రీలు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకుంటే తక్కువ కేలరీలు, ఐరన్, ఫొలేట్, పొటాషియం, విటమిన్లు వంటి పోషకాలు లభిస్తాయని..ఇవి చిన్న చిన్న వ్యాధులతో పోరడటానికి ఉపయోగపడతాయని చెబుతున్నారు.

లిచీ:

వర్షాకాలంలో లిచీ పండును తప్పకుండా తినాలంటున్నారు వైద్యులు. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో శక్తి సామర్థ్యాన్ని పెంచడానికి, రోగనిరోధశక్తిని పెంచడానికి సహాపడుతుందని చెబుతును్నారు. జలుబు నుంచి ఉపశమనం అందిస్తుంది. శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా అందించి బరువు తగ్గడంలో సహాయపడుతుందని అంటున్నారు.

2011లో యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం లిచీ పండ్లు తినే వ్యక్తులు జలుబు బారిన పడటం చాలా తక్కువగా ఉంటుందని కనుగొన్నారు. ఈ రీసెర్చిలో బ్రిగామ్ యాంగ్ యూనివర్సిటీలో పోషకాహార శాస్త్రవేత్త ప్రొఫెసర్ డాక్టర్ డేవిడ్ జె. డంకన్ పాల్గొన్నారు.

పియర్స్:

వర్షాకాలంలో అనేక ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి చాలా విటమిన్లు మన శరీరానికి అవసరం. అయితే ఈ విటమిన్లు అన్నీపియర్స్ పండ్లలో పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా తినమని సలహా ఇస్తున్నారు.

చెర్రీస్:

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అంటు వ్యాధులను నివారిస్తాయి. మెదడుకు విశ్రాంతి, ప్రశాంతతను అందిస్తాయి.

దానిమ్మ:

వర్షాకాలంలో ఎక్కువగా లభించే పండ్లలో దానిమ్మ కూడా ఒకటి. ఈ దానిమ్మ గింజలు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా దానిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ ని బలోపేతం చేయడం సహా, దగ్గు, జలుబు, వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.

యాపిల్స్ :

రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదంటారు. కారణం ఇందులోని పోషకాలు. ఇవి అనేక వ్యాధుల నుంచి రక్షించడలో సహాయపడతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories