Relationship News: ఈ అలవాట్లు మీ భాగస్వామికి ఉన్నాయా.. వారు మిమ్మల్ని మోసం చేస్తున్నట్లు లెక్క..!

Relationship News: భార్యాభర్తల సంబంధం కలకాలం కొనసాగాలంటే అందుకు పునాది నమ్మకం. ఇది లేకుంటే ఆ బంధం ఎక్కువ కాలం నిలవదు.

Shekhar G
Updated on: 16 March 2024 8:01 PM IST
If You Notice These Habits In Your Partner Then Understand That They Are Cheating On You
X

Relationship News: ఈ అలవాట్లు మీ భాగస్వామికి ఉన్నాయా.. వారు మిమ్మల్ని మోసం చేస్తున్నట్లు లెక్క..!

Relationship News: భార్యాభర్తల సంబంధం కలకాలం కొనసాగాలంటే అందుకు పునాది నమ్మకం. ఇది లేకుంటే ఆ బంధం ఎక్కువ కాలం నిలవదు. అపార్థాలు మొదలై చివరకు ఆ జంట విడాకులు తీసుకుంటారు. వాస్తవానికి ఈ రోజుల్లో చాలామంది భాగస్వాములు తమ పార్ట్‌నర్‌ను మోసం చేస్తున్నారు. కొన్ని కారణాల వల్ల వారిపై ఇష్టం లేనట్లు ప్రవర్తించడం, అవమానించడం చేస్తున్నారు. ఒకవేళ మీ పార్ట్‌నర్‌ దగ్గర కొత్తగా ఈ అలవాట్లను గమనిస్తే వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారని అర్థం. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఆకస్మిక బిజీ

మీ భాగస్వామి అకస్మాత్తుగా మునుపటి కంటే బిజీగా మారినట్లయితే దానికి సరైన కారణం మీకు తెలియకపోతే వారు మీతో అబద్ధం చెప్పే అవకాశం ఉంటుంది. ఇది మిమ్మల్ని మోసం చేస్తున్నారనడానికి సంకేతం కావచ్చు.

ఆలస్యంగా వస్తే వివరణ ఇవ్వకపోవడం

కొంతమందికి ఆలస్యంగా వచ్చే అలవాటు ఉంటుంది కానీ దానికి సరైన కారణం చెప్పరు. మీ భాగస్వామి తరచుగా ఇలా చేస్తే వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారని అర్థం చేసుకోండి. మీకు తెలియకుండా ఏదో ఒక విషయాన్ని దాస్తున్నారని అర్థం.

కళ్లలో చూడలేకపోవడం

మీ భాగస్వామి మీ కళ్లతో కళ్లు పెట్టి చూడకుండా మాట్లాడడం చేస్తే వారు ఏదో తప్పు చేస్తున్నట్లు లెక్క. మీతో మాట్లాడేటప్పుడు స్పష్టంగా మాట్లాడకపోతే వారు అబద్ధం చెబుతున్నారని అర్థం.

ముఖ్యమైన సంభాషణలను నివారించడం

కమ్యూనికేషన్ అనేది ఏ సంబంధానికైనా పునాది. మీ భాగస్వామి మీ రిలేషన్‌ షిప్‌ గురించి, భవిష్యత్‌ గురించి మాట్లాడకుండా ఉంటే అది మోసానికి సంకేతం అవుతుంది. ఈ విషయాలు చాలా రోజులనుంచి మీ భాగస్వామి దగ్గర గమనిస్తే వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.

Shekhar G

Shekhar G

Next Story