Instant Facial: ఐదు నిమిషాల్లో సింపుల్ ఫేషియల్ – మెరిసే చర్మం మీదే!

Instant Facial: ఐదు నిమిషాల్లో సింపుల్ ఫేషియల్ – మెరిసే చర్మం మీదే!
x

 Instant Facial: ఐదు నిమిషాల్లో సింపుల్ ఫేషియల్ – మెరిసే చర్మం మీదే!

Highlights

ప్రతి అమ్మాయీ తళుకుగా మెరిసే చర్మాన్ని కోరుకుంటారు. కానీ రోజువారీ ఒత్తిడి, కాలుష్యం, తప్పైన ఆహారం వంటి సమస్యల వల్ల చర్మం మీద ప్రతికూల ప్రభావం పడుతోంది

Instant Facial: ప్రతి అమ్మాయీ తళుకుగా మెరిసే చర్మాన్ని కోరుకుంటారు. కానీ రోజువారీ ఒత్తిడి, కాలుష్యం, తప్పైన ఆహారం వంటి సమస్యల వల్ల చర్మం మీద ప్రతికూల ప్రభావం పడుతోంది. మొటిమలు, మచ్చలు, చర్మం డల్గా కనిపించడం వంటి సమస్యలు అందాన్ని తగ్గిస్తుంటే, పార్లర్ చుట్టూ తిరగడం ఖర్చుతో పాటు టైమ్ వృథా చేస్తోంది. అయితే చింతించాల్సిన పనిలేదు! ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఈ నేచురల్ ఫేషియల్ స్టెప్స్‌తో మీరు కూడా ఆరోగ్యవంతమైన గ్లోయింగ్ స్కిన్‌ను పొందవచ్చు.

స్టెప్ 1: కీరదోస కూలింగ్ క్లీన్స్

కీరదోస ముక్కలను మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్‌లా చేయండి. ముఖానికి అప్లై చేసి 30 నిమిషాలపాటు వదిలేయండి. తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేయండి. ఇది చర్మానికి చల్లదనాన్ని ఇచ్చి, టానింగ్ తగ్గించడంలో సహాయపడుతుంది.

స్టెప్ 2: అరటి-ఓట్స్ స్క్రబ్

పండిన అరటిపండు గుజ్జు మరియు ఓట్స్‌ను కలిపి పేస్ట్ చేయండి. దీనిని ముఖంపై సర్కులర్ మోషన్‌లో మసాజ్ చేస్తూ అప్లై చేయండి. 10-15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది డెడ్ స్కిన్ తొలగించి, చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.

స్టెప్ 3: బొప్పాయి-తేనె గ్లో ప్యాక్

రెండు టేబుల్ స్పూన్ బొప్పాయి గుజ్జు మరియు ఒక స్పూన్ తేనె కలిపి ముఖానికి అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడిగేయండి. ఇది ముఖానికి ఫ్రెష్‌నెస్ మరియు నేచురల్ గ్లోను అందిస్తుంది.

స్టెప్ 4: కీరదోస + రైస్ వాటర్ టోన్-అప్

కీరదోస జ్యూస్ మరియు రైస్ వాటర్‌ను సమాన మోతాదులో కలిపి ముఖానికి అప్లై చేయండి. అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయండి. ఇది స్కిన్ టోన్‌ను ఈవెన్ చేయడంలో, రిఫ్రెష్ చేయడంలో బాగా సహాయపడుతుంది.

గమనిక:

ఈ ఫేషియల్‌ పదార్థాలు సహజమైనవే అయినప్పటికీ, వినియోగించే ముందు డెర్మటాలజిస్ట్ సలహా తీసుకోవడం మంచిది. ప్రతి చర్మం అవసరం భిన్నంగా ఉంటుందనీ, మీ చర్మానికి ఏది సరిపోతుందో తెలుసుకొని మాత్రమే వాడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories