IRCTC: IRCTC మహాశివరాత్రి స్పెషల్: 11 రోజుల్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. అతి తక్కువ ధరకే ప్యాకేజీ!

IRCTC: IRCTC మహాశివరాత్రి స్పెషల్: 11 రోజుల్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. అతి తక్కువ ధరకే ప్యాకేజీ!
x

IRCTC: IRCTC మహాశివరాత్రి స్పెషల్: 11 రోజుల్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. అతి తక్కువ ధరకే ప్యాకేజీ!

Highlights

IRCTC: పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ సరికొత్త 'సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర'ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

IRCTC Launches Maha Shivratri Special Jyotirlinga Tour: పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ సరికొత్త 'సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర'ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 2026 ఫిబ్రవరి 6న సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర ద్వారా దేశంలోని ప్రముఖ 7 జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు.

సందర్శించే క్షేత్రాలు:

11 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్ (మధ్యప్రదేశ్), నాగేశ్వర్, సోమనాథ్ (గుజరాత్), భీమశంకర్, త్రయంబకేశ్వర్, మరియు ఘృష్ణేశ్వర్ (మహారాష్ట్ర) జ్యోతిర్లింగాలను సందర్శించవచ్చు.

ముఖ్యమైన వివరాలు:

ప్రారంభ తేదీ: 2026 ఫిబ్రవరి 6 (ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ నుంచి).

బోర్డింగ్ పాయింట్లు: సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, నాందేడ్, పూర్ణ జంక్షన్.

మొత్తం సీట్లు: 750 మాత్రమే.

వసతులు: 2AC, 3AC, మరియు స్లీపర్ క్లాస్ సౌకర్యం కలదు.

ఇక ఈ యాత్రలో ఒకరికి స్లీపర్ ట్రైన్ లో రూ.17,600 ఛార్జి చేస్తారు. థర్డ్ ఏసీ అయితే రూ.26,700, సెకండ్ ఏసీ రూ. 34,600 ఛార్జీ వసూలు చేస్తారు. అదే ఐదేళ్ల నుంచి 11 ఏళ్ల మధ్యలో ఉన్న పిల్లలకు అయితే ఎకానమీ స్లీపర్ రూ.16,300, 3ఏసీ రూ.25,200, 2ఏసీ రూ. 32,800 వసూలు చేస్తారు. ఈ రైల్వే టూరిజంలో భాగంగా భారతీయ రైల్వే 33 శాతం డిస్కౌంట్ భారత్ గౌరవ ట్రైన్స్ అందుబాటులో ఉంది.

యాత్ర షెడ్యూల్:

ఫిబ్రవరి 6: సికింద్రాబాద్‌లో ప్రయాణం ప్రారంభం.

ఫిబ్రవరి 7: ఉజ్జయిని చేరుకోవడం, మహాకాళేశ్వర్ దర్శనం.

ఫిబ్రవరి 8: ఓంకారేశ్వర దర్శనం అనంతరం ద్వారకకు ప్రయాణం.

ఫిబ్రవరి 9: ద్వారక చేరుకోవడం, రాత్రి బస.

ఫిబ్రవరి 10: ద్వారకాధీశ దర్శనం, అనంతరం నాగేశ్వర జ్యోతిర్లింగం సందర్శన. రాత్రి సోమనాథ్‌కు ప్రయాణం.

ఆసక్తి గల భక్తులు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ సీట్లను బుక్ చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories