IRCTC Tour Plan:శ్రావణమాసంలో సరికొత్త టూర్ ప్యాకేజ్..తక్కువ ఛార్జీకే అరుణాచలం TO తంజావూర్..పూర్తి వివరాలివే​

IRCTC Tour Plan: Arunachalam TO Thanjavur at low fare..Full details
x

IRCTC Tour Plan:శ్రావణమాసంలో సరికొత్త టూర్ ప్యాకేజ్..తక్కువ ఛార్జీకే అరుణాచలం TO తంజావూర్..పూర్తి వివరాలివే​

Highlights

IRCTC Tour Plan: కొన్నిరోజుల్లోనే శ్రావణమాసం ప్రారంభం కానుంది. ఈ మాసంలో చాలా మంది పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వారికోసం ఐఆర్ సీటీసీ అదిరిపోయే ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ ప్యాకేజీ వివరాలేంటి? ఎన్ని రోజులు టూర్. ఇవన్నీ విషయాలు తెలుసుకుందాం.

IRCTC Tour Plan:శ్రావణమాసం హిందువులకు ఎంతో ముఖ్యమైంది. వ్రతాలు, పూజలు అంటూ నిత్యం బిజీగా ఉంటారు. ఈ మాసంలో దేశంలోని ప్రముఖ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. అయితే కొంతమంది భక్తులు దేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాలను దర్శించుకోవాలని ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వారికోసం IRCTC బంపర్ ప్యాకేజీనీ తీసుకువచ్చింది. తక్కువ ఛార్జీతో ప్రముఖ దేవాలయాలన్నీ దర్శించుకోవచ్చు. ఈ ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా శ్రావణం స్పెషల్ IRCTC దివ్య దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ పేరుతో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ రైలు ప్రయాణిస్తుందని IRCTC తెలిపింది. సికింద్రాబాద్ నుంచి కాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తుంది. ఈ స్టేషన్లలో రైలు ఎక్కొచ్చు.యాత్ర ముగిసిన తర్వాత ఈ రైల్వేస్టేషన్లలో దిగవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ మొత్తం ఎనిమిది రాత్రిళ్లు, 9 పగళ్లు సాగుతుంది.

-మొదటి రోజు సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12గంటలకు భారత్ గౌరవ్ టూరిస్టు రైలు ప్రారంభం అవుతుంది. కాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా రెండో రోజు ఉదయం 7 గంటలకు తిరువణ్ణామలై రైల్వేస్టేషన్​ కు చేరుకుంటారు. అక్కడి నుంచి ముందుగానే బుక్ చేసిన హోటల్ తీసుకువెళ్తారు. అనంతరం అరుణాచలం దర్శించుకుంటారు. ఆ తర్వాత రైల్వే స్టేషన్ కు వచ్చి కుదాల్ నగర్ కు ప్రయాణం అవుతారు.

-3వ రోజు ఉదయం కుదాల్ నగర్ చేరుకుని ..అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రామేశ్వరం చేరుకుంటారు. అక్కడ స్థానికంగా ఉన్న దేవాలయాలను దర్శించుకుని సాయంత్రం హోటల్ కు వచ్చి అక్కడే భోజనం చేసి నిద్రిస్తారు.

-4వ రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రామేశ్వరం నుంచి బస్సు ప్రయాణం ద్వారా మదురై వెళ్తారు. సాయంత్రం మీనాక్షి అమ్మన్ ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం కుందాల్ నగర్ రైల్వే స్టేషన్ కు చేరకుంటారు. అక్కడి నుంచి కన్యాకుమారికి ప్రయాణం

-5వరోజు ఉదయం కొచ్చువేలి స్టేషన్ కు చేరుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కన్యాకుమారి చేరుకుంటారు. అనంతరం రాక్​ మెమోరియల్​, గాంధీ మండపం, సూర్యాస్తమయం సందర్శిస్తారు. తిరిగి హోటల్​కు చేరుకుని భోజనం ముగించి ఆ రాత్రికి కన్యాకుమారిలో స్టే చేస్తారు.

-6వ రోజు ఉదయం రోడ్డు మార్గం ద్వారా త్రివేండ్రం వెళ్తారు.పద్మనాభ స్వామి ఆలయం దర్శించుకుని.. బీచ్​లో ఎంజాయ్​ చేస్తారు. అక్కడి నుంచి కొచ్చువేలి స్టేషన్​కు చేరుకుంటారు. అనంతరం తిరుచిరాపల్లి బయలుదేరుతారు.

-7వ రోజు ఉదయం తిరుచిరాపల్లి చేరుకుని మధ్యాహ్నం భోజనం తర్వాత తంజావూర్​ వెళ్తారు. అక్కడ బృహదీశ్వర ఆలయాన్ని దర్శించుకుని.. అక్కడి నుంచి తంజావూర్​ రైల్వే స్టేషన్​కు చేరుకుని ...అక్కడి నుంచి సికింద్రాబాద్​కు స్టార్ట్​ అవుతారు.

-8వ రోజు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఖమ్మం, వరంగల్​, కాజీపేట మీదుగా 9వ రోజు ఉదయం 2.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో దివ్య దర్శన యాత్ర పూర్తవుతుంది.

ప్యాకేజీ ధరలు చూస్తే..

ఎకానమీ: పెద్దలకు రూ.14,250, 5 నుంచి 11ఏండ్ల పిల్లలకు రూ.13,250

స్టాండర్డ్​: పెద్దలకు రూ.21,900, 5 నుంచి 11 ఏండ్ల పిల్లలకు రూ.20,700.

కంఫర్ట్​: పెద్దలకు రూ.28,450, 5 నుంచి 11 ఏండ్ల పిల్లలకు రూ.27,010గా

ప్రస్తుతం ఈ టూర్​ ఆగష్టు 4వ తేదీన ప్రారంభం:

- ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం రైల్వే సిబ్బంది చూసుకుంటారు.

- ప్యాకేజ్​ను బట్టి ప్రయాణానికి ఏసీ లేదా నాన్​ ఏసీ వెహికిల్.

- టూరిస్టులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories