Lifestyle: ఇంట్లో పిల్లలు ఉన్నారా.? ఏసీ విషయంలో ఈ తప్పులు చేయకండి

AC Safe for Babies
x

Lifestyle: ఇంట్లో పిల్లలు ఉన్నారా.? ఏసీ విషయంలో ఈ తప్పులు చేయకండి

Highlights

Lifestyle: ఏప్రిల్ నెల మొదలయ్యేసరికి వేడి భరించలేనంతగా పెరిగిపోయింది.

Lifestyle: ఏప్రిల్ నెల మొదలయ్యేసరికి వేడి భరించలేనంతగా పెరిగిపోయింది. ఈ ఉష్ణోగ్రతల కారణంగా చాలా మంది తమ ఇళ్లలో ACలు, కూలర్లు ఎక్కువగా వాడుతున్నారు. అయితే, మీ ఇంట్లో ఒక నెల నుంచి ఆరు నెలల మధ్య వయస్సు ఉన్న బిడ్డలు ఉంటే, AC వాడుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. చిన్న పిల్లలు ఎక్కువ సేపు ACలో ఉంటే ఆరోగ్యానికి ముప్పు కలుగుతుంది అని వైద్యులు సూచిస్తున్నారు.

మీ ఇంట్లో 6 నెలల లోపు పిల్లవాడు ఉంటే, AC ఉష్ణోగ్రత ఎప్పుడూ 25 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువగా పెట్టకూడదు. ఏసీ ఎక్కువగా ఉపయోగిస్తే చిన్నారుల్లో దగ్గు, గాలి మారడం వల్ల న్యుమోనియా, శ్వాస సంబంధిత ఇబ్బందులు (అస్తమా వంటి సమస్యలు) వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు ఏసీ గదిలో దగ్గుతున్నట్లయితే వెంటనే AC ఆఫ్ చేయాలి, లేదా ఉష్ణోగ్రతని తక్కువగా సెట్ చేయడం మానేయాలి.

ఒకవేళ ఏసీ ఉన్న ప్రదేశాల్లో పడుకోవాల్సి వస్తే.. పిల్లలపై సన్నని దుప్పటి కప్పాలి. తల, కాళ్లు పూర్తిగా కప్పి ఉంచండి. AC గాలి నేరుగా పిల్లలపై తగలకుండా చూసుకోండి. పిల్లలను ఎక్కువసేపు ACలో ఉంచకండి. ఏసీలో ఎక్కువగా సేపు ఉంటే చర్మం పొడిబారడం, చర్మ అలెర్జీలు, శరీరంలో నీరు తగ్గడం (డీహైడ్రేషన్), లూజ్ మోషన్స్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

అందుకే వీలైనంత వరకు ఏడాది లోపు పిల్లల్ని ఏసీలో ఉంచకూడదు. అదే విధంగా ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ఉండాల్సి వచ్చినా ఏసీ టెంపరేచర్‌ 25 డిగ్రీలకే పరిమితం చేయండి. పిల్లల ఆరోగ్యం కోసం వీటిని తప్పకుండా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories