Coconut Water: కొబ్బరి నీళ్లను ఫ్రిజ్‌లో పెట్టి తాగుతున్నారా? వైద్యుల హెచ్చరిక

Coconut Water
x

Coconut Water: కొబ్బరి నీళ్లను ఫ్రిజ్‌లో పెట్టి తాగుతున్నారా? వైద్యుల హెచ్చరిక

Highlights

Coconut Water Side Effects: కొబ్బరి నీళ్లు అంటేనే సహజ ఎలక్ట్రోలైట్స్ అయితే వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి మంచి పోషణ కూడా అందిస్తుంది.

Coconut Water Side Effects: కొబ్బరి నీళ్లు అంటేనే సహజ ఎలక్ట్రోలైట్స్ అయితే వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి మంచి పోషణ కూడా అందిస్తుంది.

కొబ్బరి నీళ్లలో తీసుకోవాలని వైద్యులు చెబుతారు. ఇందులో సహజ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. అయితే కొబ్బరి నీళ్లను కొంతమంది ఫ్రిడ్జ్ లో పెట్టి తాగుతారు. వెంటనే తాగకుండా ఇలా ఫ్రిజ్లో పెట్టి తాగటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

కొబ్బరి నీళ్లు మనకు ప్రకృతి సహజసిద్ధంగా అందించిన నీళ్లు. వీటిని సహజంగానే తాగాలి. అయితే వీటిని ఫ్రిజ్‌లో పెట్టి తాగడం వల్ల ఒక వ్యక్తి మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లు తెచ్చిన వెంటనే తీసుకోవాలి 2021 నివేదిక ప్రకారం ఒక వ్యక్తి కొబ్బరి నీళ్లు ఫ్రిడ్జ్ లో పెట్టి తాగిన వెంటనే వికారం, వాంతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో అతనికి ఏమైందో అర్థం కాలేదు. అయితే అతనికి MRI స్కాన్ తీయగా అప్పుడు తెలిసింది బ్రెయిన్ ఫెయిల్ అయి చనిపోయాడని..

అయితే ఈ వ్యక్తి కొబ్బరి బోండం కొనుగోలు చేసి ఒక నెలపాటు ఇంటి వంట గదిపై పెట్టి ఆ తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టారని తెలిసింది. దాన్ని ఆ వ్యక్తి తీసుకోవడంతో ఇలా వాదంతులు వికారంతో చనిపోయాడు. ఈ నేపథ్యంలో ఎప్పటికైనా కొబ్బరికాయ పగలగొట్టిన వెంటనే తాగాలి. అలాగే ఇంట్లో పెట్టి గది ఉష్ణోగ్రతలో నెలలపాటు పెట్టడం వల్ల ఇది ప్రాణాల మీదకు తీసుకువస్తుంది.

ఇది మాత్రమే కాదు కట్ చేసిన కొబ్బరికాయ కూడా గాలి చొరబడిన డబ్బాలో మాత్రమే నిల్వ చేయండి. మీరు కేవలం మూడు రోజుల్లో ఈ కొబ్బరిని ఉపయోగించాలి. ఇది కూడా ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలను తీసుకువస్తుంది. బ్యాక్టీరియా, వైరస్, టాక్సిన్స్ ఏర్పడతాయి. తద్వారా మీరు తీసుకున్న వెంటనే మీ శరీరంలోకి విషం వ్యాపిస్తుంది. ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం కూడా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories