Sleeping with Bra : రాత్రి బ్రా వేసుకుని పడుకోవడం నిజంగా ప్రమాదకరమా? దీని వెనుక ఉన్న నిజం ఏంటి ?

Sleeping with Bra
x

Sleeping with Bra : రాత్రి బ్రా వేసుకుని పడుకోవడం నిజంగా ప్రమాదకరమా? దీని వెనుక ఉన్న నిజం ఏంటి ? 

Highlights

Sleeping with Bra : రాత్రి పడుకునేటప్పుడు బిగుతైన దుస్తులు ధరించకూడదు అనే ఉద్దేశంతో చాలామంది లూజ్ ప్యాంటు, టీ-షర్ట్‌లు ధరిస్తారు.

Sleeping with Bra: రాత్రి పడుకునేటప్పుడు బిగుతైన దుస్తులు ధరించకూడదు అనే ఉద్దేశంతో చాలామంది లూజ్ ప్యాంటు, టీ-షర్ట్‌లు ధరిస్తారు. మరికొందరు అయితే లోదుస్తులు కూడా లేకుండా పడుకుంటారు. కానీ చాలామంది మహిళలు రాత్రి కూడా బ్రా ధరించి పడుకుంటారు. ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతుంటారు. నిజంగా రాత్రిపూట బిగుతైన బ్రా ధరించి పడుకోవడం హానికరం అవుతుందా? దీనివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రి బ్రా ధరించి పడుకోవడం వల్ల కలిగే నష్టాలు

రాత్రిపూట బ్రా ధరించి పడుకోవడం వల్ల చాలామందికి తెలియని కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అవేంటో చూద్దాం.

1. ఇన్ఫెక్షన్ల ప్రమాదం:

రాత్రి సమయంలో బిగుతైన బ్రా ధరించడం వల్ల ఛాతీ భాగంలో చెమట ఎక్కువగా పడుతుంది. ఈ చెమట కారణంగా ఆ ప్రాంతం తడిగా ఉండి, అక్కడ బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే రాత్రి పడుకునేటప్పుడు బ్రా ధరించడం మంచిది కాదని నిపుణులు చెబుతారు.

2. అలర్జీ సమస్యలు:

పగలు మొత్తం బ్రా ధరించడం వల్ల చర్మం చెమటతో ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీరు రాత్రి కూడా అదే బ్రా ధరిస్తే, మీ చర్మంపై దద్దుర్లు, పుండ్లు, అలర్జీలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

3. రక్త ప్రసరణకు అడ్డంకి:

రాత్రిపూట బిగుతైన బ్రా ధరించడం వల్ల రొమ్ముల చుట్టూ రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. బ్రా చాలా బిగుతుగా ఉంటే, అది మీ రొమ్ములపై ఒత్తిడిని పెంచుతుంది. రక్త నాళాలను సంకోచింపజేస్తుంది, దీనివల్ల రక్త ప్రసరణ తగ్గుతుంది.

4. నిద్రకు భంగం:

మంచి నిద్ర రావాలంటే పడక మాత్రమే కాదు, మీరు ధరించే బట్టలు కూడా సౌకర్యవంతంగా ఉండాలి. బిగుతైన బ్రా ధరించడం వల్ల ఛాతీ ప్రాంతానికి గాలి సరిగ్గా అందదు. దీనివల్ల రాత్రిపూట చెమట ఎక్కువగా పడుతుంది. అది ఒక రకమైన ఊపిరి ఆడనట్లుగా అనిపిస్తుంది. దీనివల్ల నిద్రకు కూడా భంగం కలిగే అవకాశం ఉంది. అందుకే మంచి నిద్ర కోసం రాత్రిపూట బ్రా లేకుండా పడుకోవడం అలవాటు చేసుకోండి.

5. చర్మంపై చికాకు:

రాత్రి పడుకునేటప్పుడు బ్రా ధరిస్తే చర్మంపై చికాకు కలుగుతుంది. బ్రా హుక్స్, పట్టీలు చర్మంపై ఒత్తిడిని పెంచుతాయి. దీనివల్ల అక్కడ మంట, దురద వంటి సమస్యలు రావచ్చు.

6. రొమ్ము క్యాన్సర్ ప్రమాదం:

రాత్రి బ్రా లేకుండా పడుకోవడం వల్ల రొమ్ము కండరాలు రిలాక్స్ అవుతాయి. రక్త ప్రసరణ సులభంగా జరుగుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, రోజూ రాత్రి బ్రా ధరించి పడుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని చెబుతున్నాయి. అయితే, ఈ విషయంలో పూర్తిస్థాయి పరిశోధన ఇంకా జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories