White Rice : రుచి ఎక్కువ, పోషకాలు తక్కువ.. వైట్ రైస్ తినడం వల్ల వచ్చే 5 పెద్ద సమస్యలివే

White Rice : రుచి ఎక్కువ, పోషకాలు తక్కువ.. వైట్ రైస్ తినడం వల్ల వచ్చే 5 పెద్ద సమస్యలివే
x

White Rice : రుచి ఎక్కువ, పోషకాలు తక్కువ.. వైట్ రైస్ తినడం వల్ల వచ్చే 5 పెద్ద సమస్యలివే

Highlights

ఈ రోజుల్లో చాలా మంది తినే తెల్ల బియ్యం చూడటానికి చాలా తెల్లగా, మెరుస్తూ కనిపిస్తుంది. ఎందుకంటే మనం రోజూ తినే ఈ బియ్యాన్ని మిల్లుల్లో పెట్టి చాలా సార్లు పాలిష్ చేస్తారు.

White Rice : ఈ రోజుల్లో చాలా మంది తినే తెల్ల బియ్యం చూడటానికి చాలా తెల్లగా, మెరుస్తూ కనిపిస్తుంది. ఎందుకంటే మనం రోజూ తినే ఈ బియ్యాన్ని మిల్లుల్లో పెట్టి చాలా సార్లు పాలిష్ చేస్తారు. అందుకే అవి అలా అందంగా కనిపిస్తాయి. కానీ ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే.. ఇలా పాలిష్ చేసిన బియ్యం రోజూ తినడం అస్సలు మంచిది కాదట. పూర్వం ప్రజలు ఎర్ర బియ్యం (బ్రౌన్ రైస్) తినేవారు, అందుకే చాలా ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న మనిషిని వెతకడమే కష్టంగా మారిపోయింది. మరి ఈ తెల్ల బియ్యం తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో చూద్దాం.

పోషకాలు మాయం, రోగాలు స్వాగతం

పాలిష్ చేసిన బియ్యం తినడం వల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్ B1 సరిగా అందదు. దీనివల్ల బెరిబెరి అనే ప్రమాదకరమైన జబ్బు వచ్చే అవకాశం ఉంది. ఇది మన నాడీ వ్యవస్థ, గుండె పనితీరును కూడా నెమ్మదిస్తుంది. పాలిష్ చేసే క్రమంలో బియ్యంపై ఉండే ముఖ్యమైన పోషకాల పొర (తవుడు) పోతుంది. ముఖ్యంగా ఫైబర్, విటమిన్స్ పోవడం వల్ల ఇవి కేవలం కార్బోహైడ్రేట్లుగా మాత్రమే మిగిలిపోతాయి.

మధుమేహం వచ్చే రిస్క్ ఎక్కువ

పాలిష్ చేసిన బియ్యంలో కార్బోహైడ్రేట్స్ (పిండి పదార్థాలు) చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని వెంటనే పెంచేస్తాయి. దీనివల్ల టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఈ బియ్యం అరగడం కష్టమై, అజీర్తి, పొట్ట ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలకు కూడా దారి తీస్తాయి.

బరువు పెరగడం, మానసిక సమస్యలు

పాలిష్ చేసిన అన్నం తింటే ఆకలి ఎక్కువ అవుతుందట. ఎందుకంటే ఇందులో ఫైబర్ (పీచు పదార్థం) చాలా తక్కువగా ఉంటుంది. ఎంత తిన్నా పొట్ట నిండిన ఫీలింగ్ రాదు, మళ్ళీ ఆకలేస్తుంది. దాంతో జంక్ ఫుడ్ తినడానికి మొగ్గు చూపి, చాలా మంది బరువు పెరుగుతారు. ఇంకా, ఇందులో పోషకాలు తక్కువగా ఉండడం వల్ల మూత్రపిండాలకు కూడా సరైన పోషణ అందదు.

నరాల సమస్యలు: ఈ బియ్యం రోజూ తినడం వల్ల చేతులు, కాళ్ళు మరమరలాగా మొద్దుబారడం వంటి నరాల సమస్యలు వస్తాయి.

మానసిక ఆరోగ్యం: పోషకాలు లోపించడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

ఊపిరితిత్తుల సమస్య: అతిగా పాలిష్ చేసిన బియ్యం తినడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడా రావచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వీలైనంత వరకు తక్కువ పాలిష్ చేసిన బియ్యం, బ్రౌన్ రైస్ లేదా ఇతర చిరుధాన్యాలు తినడానికి ప్రయత్నించడం మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories