Working Long Hours: ఎక్కువ గంటలు పనిచేస్తే లాభమా? నష్టమా?

Working Long Hours:  ఎక్కువ గంటలు పనిచేస్తే లాభమా? నష్టమా?
x

Working Long Hours: ఎక్కువ గంటలు పనిచేస్తే లాభమా? నష్టమా?

Highlights

వారానికి ఎన్ని గంటలు పనిచేయాలి? అన్న టాపిక్ ఇటీవల వైరల్ అయింది. దీనిపై చాలామంది చాలారకాల అభిప్రాయాలు వెల్లడించారు.

‘వారానికి ఎన్ని గంటలు పనిచేయాలి?’ అన్న టాపిక్ ఇటీవల వైరల్ అయింది. దీనిపై చాలామంది చాలారకాల అభిప్రాయాలు వెల్లడించారు. అయితే అసలు రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తే ఆరోగ్యానికి మంచిది. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఏమైనా నష్టాలుంటాయా? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

చేసే పనిలో ప్రొడక్టివిటీ దృష్ట్యా ఎక్కువ గంటలు పనిచేస్తే మంచిదని కొందరు.. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుదని మరికొందరు.. ఇలా రకరకాల అభిప్రాయాలు వ్యక్త పరుస్తున్నారు. వీటిలో దేన్ని పరిగణలోకి తీసుకోవాలంటే..

వర్కింగ్ అవర్స్ విషయంలో మానసిక ఆరోగ్యానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. అంటే తక్కువ సమయం పనిచేయాలని కాదు, చేసే పని ఇష్టంగా ఉంటే ఎంతసేపు పనిచేసినా పర్వాలేదని, ఒకవేళ పనిలో ఒత్తిడి ఉంటే తక్కువ గంటలు పని చేస్తూ మానసిక ఒత్తిడి లేకుండా లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

నష్టాలు ఇవీ

ఒత్తిడితో కూడిన పనిని ఎక్కువసేపు చేయడం వల్ల మరింత ఒత్తిడి పెరగడంతోపాటు డయాబెటిస్, ఒబెసిటీ, గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుంది. వారానికి 50 గంటల కంటే ఎక్కువ సమయం పని చేయడం వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే రిస్క్ 35 శాతం పెరుగుతుందని కొన్ని స్టడీల్లో తేలింది.

లాభాలు ఇవీ.

ఎక్కువ పని గంటల వల్ల లాభాలూ ఉన్నాయి. ఎక్కువ పని చేయడం వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది. కెరీర్‌‌లో త్వరగా పైకి ఎదగొచ్చు. అయితే చేసేపనిని ఆస్వాదిస్తూ ఒత్తిడి లేకుండా చేసినప్పుడే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. కెరీర్‌‌లో ఎదుగుదలను కోరుకునేవాళ్లు పనిని ప్రేమిస్తూ ఇష్టపూర్వకంగా ఎక్కువ గంటలు పనిచేయడానికి పూనుకోవాలి. అప్పుడే సరైన లాభం ఉంటుంది. english title and keywords

Show Full Article
Print Article
Next Story
More Stories