Joint Pains: నడుస్తున్నా, వ్యాయామం చేస్తున్నా కీళ్లు నొప్పిగా ఉన్నాయా?


Joint Pains: చాలామంది సమయం ప్రకారం వాకింగ్‌లు, వ్యాయామాలు, యోగాలు చేస్తుంటారు. కానీ ఇవి చేస్తున్నప్పుడు కొంతమందికి కీళ్లు నొప్పి పెడుతున్నాయి. వ్యాయామం చేసిన తర్వాత లేదా వాకింగ్ చేసి వచ్చిన తర్వాత కాళ్ల జాయింట్లలో నొప్పి ఎక్కువగా వస్తుంది.
Joint Pains: చాలామంది సమయం ప్రకారం వాకింగ్‌లు, వ్యాయామాలు, యోగాలు చేస్తుంటారు. కానీ ఇవి చేస్తున్నప్పుడు కొంతమందికి కీళ్లు నొప్పి పెడుతున్నాయి. వ్యాయామం చేసిన తర్వాత లేదా వాకింగ్ చేసి వచ్చిన తర్వాత కాళ్ల జాయింట్లలో నొప్పి ఎక్కువగా వస్తుంది. అయితే వ్యాయామం చేసినా, చేయకపోయినా ఇప్పుడు చాలామంది ఎదుర్కుంటున్న ఆరోగ్య సమస్య ఏంటంటే.. జాయింట్ పెయిన్స్. అయితే వీటిని నివారించాలంటే మీరు కొన్ని రకాల ఆహారపదార్ధాలు తీసుకోవాలని డాక్టర్లు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా కీళ్ల నొప్పులు పెరిగాయంటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని అర్ధం. అందుకు ముందు యూరిక్ యాసిడ్‌ని శరీరంలో తగ్గించాలి. యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో కొన్ని కూరగాయలు సహాయపడతాయి. ముఖ్యంగా కొన్ని రకాలు ఆకుకూరలు కూరగాయలు యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
పచ్చని ఆకు కూరలు మేలు
ఎప్పుడైనా పచ్చని ఆకుకూరలు తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ ఉన్నవారు పాలకూర, తోటకూర, మెంతుకూరలను తరచూ తీసుకోవాలి. అంటే ప్రతిరోజు ఏదో ఒకటి ఆహారంలో ఉండేటట్లు చూసుకోవాలి. ఇవి యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో దోహదం చేస్తాయి. అంతేకాదు శరీరానికి అవసరమయ్యే ఖనిజాలు, విటమిన్లు కూడా ఈ ఆకుకూరలు అందిస్తాయి.
క్యారెట్లు
చాలామంది క్యారెట్లను సలాడ్‌గా తింటుంటారు. మరికొంతమంది ఫ్రై చేస్తారు. ఈ రూపంలో తిన్నా క్యారెట్ చాలామంచిది. ఇందులో యాంటీ యాక్సిడెంట్లు అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. జీర్ణక్రియలో ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడంలోనూ క్యారెట్లు చాలా బాగా సహాయపడతాయి. ఒక వేళ క్యారెట్ కూరలా తినాలనిపించకపోతే పచ్చడిలా చేసుకుని ఈ క్యారెట్లను తినొచ్చు.
టమోటా
విటమిన్ సి ఎక్కువగా ఉండే కూరగాయ ..టమోటా. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. వారానికి మూడు, నాలుగు సార్లు టమోటా ఉన్న ఆహారం తింటే కీళ్లనొప్పులు తగ్గుతాయి.
దోసకాయ
కీర, దోస..దోస కుటుంబానికి సంబంధించిన కూరగాయలు తినడం వల్ల కూడా మీ శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. దోస కాయల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఇవి శరీరం నుంచి టాక్సిన్స్‌ను తొలగించడానికి కూడా దోహదపడుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గించే గుణం ఈ దోసకాయల్లో ఉంది.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire